అనుకున్నట్టే దెబ్బకొడుతున్న అమరన్
ఎంత పెద్ద సినిమా అయినా సరే థర్డ్ వీక్ లోకి ఎంటరయ్యాక స్లో అవడం కామన్. కానీ అమరన్(Amaran) సినిమా మాత్రం దీనికి మినహాయింపు అనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజైన కంగువ(kanguva) సినిమాకు 5 వేల లోపు టికెట్లు సేల్ అవుతుంటే అమరన్ ఏకంగా 5 వేల టికెట్లతో ముందజంలో ఉండటాన్ని చూసి ట్రేడ్ పండితుల సైతం ఆశ్చర్యపోతున్నారు.
కేవలం తమిళనాడులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కంగువ కంటే ముందే అమరన్ షో లకు ఫుల్స్ అవుతున్నాయి. కంగువ మూడో రోజు కలెక్షన్స్ కు ఐదారు లక్షల తేడాతోనే అమరన్ కలెక్ట్ చేయడం చూసిన సూర్య ఫ్యాన్స్ దాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ కంగువకు మంచి టాక్ వస్తే సీన్ వేరేలా ఉండేది.
కానీ కంగువకు వచ్చిన టాక్ వేరేలా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఆక్యుపెన్సీలు తగ్గిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం వీకెండ్ ఛాయిస్ గా మళ్లీ అమరన్, లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాలే మారాయి. రూ.2000 వేల కోట్లు వసూలు చేస్తుందని చెప్పిన కంగువ కనీసం అందులో పావు వంతైనా వసూలు చేస్తుందా అని అందరూ అనుమానపడుతున్నారు. సోమవారం నుంచి వచ్చే డ్రాప్స్ ను తలచుకుంటేనే డిస్ట్రిబ్యూటర్లు భయపడే పరిస్థితి నెలకొంది.