ASBL Koncept Ambience
facebook whatsapp X

మళ్లీ పెళ్లి చేసుకున్న జెఫ్‌ బెజోస్‌... వచ్చే నెల్లోనే వెడ్డింగ్‌!

మళ్లీ పెళ్లి చేసుకున్న జెఫ్‌ బెజోస్‌... వచ్చే నెల్లోనే వెడ్డింగ్‌!

 ప్రపంచ రెండో సంపన్నుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మళ్లీ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.  ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారట. వచ్చే నెల క్రిస్మస్‌ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. కొలరాడోలోని ఆస్పెన్‌లో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో  డిసెంబర్‌  25న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో వీరి నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసింది. ఫ్రాన్స్‌లో వెకేషన్‌ను వెళ్లిన సందర్భంలో ఓ లగ్జరీ నౌకలో 2.5 మిలియన్‌ డాలర్ల ( భారత కరెన్సీలో దాదాపు రూ.21 కోట్లు) గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి బెజోస్‌ ఆమెకు ప్రపోజ్‌ చేసినట్లు తెలిసింది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :