తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రూ.250 కోట్లతో అంబర్-రెసోజెట్
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే అంబర్-రెసోజెట్ భాగస్వామ్య సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదాక ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమై తమ పెట్టుబడుల ప్రణాళికలను వివరించారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అంబర్`రెసోజెట్ సంస్థకు ప్రభుత్వపరంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడిరచారు. దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్ల లాంటి పరికరాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తామని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్ రెడ్డి, సీఈవో మధుసూదన్, డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డా.ఎస్.కె.శర్మ, అంబర్`రెసోజెట్ ప్రతినిధులు పాల్గొన్నారు.