ASBL Koncept Ambience
facebook whatsapp X

Satya Prasad: ఇప్పటికైనా నటించడం ఆపి.. సంక్షేమానికి కృషి : మంత్రి అనగాని

Satya Prasad: ఇప్పటికైనా నటించడం ఆపి.. సంక్షేమానికి కృషి : మంత్రి అనగాని

వైసీపీ అధినేత జగన్‌ కంటే మహానటులు ఎవరు లేరని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ (Anagani satya Prasad) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదే పదే అబద్ధాలు చెప్పడంతో పాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ప్రజా రక్షణకుడిగా చెప్పడం ఆయనకే సాధ్యమైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచకపాలన సాగించి, ఇప్పుడేమో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు (Chandrababu) చేస్తున్న శ్రమను నటన అంటున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారాన్ని పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం ఘోరంగా పడిపోయిందని దుయ్యబట్టారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత, మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అహర్నిశలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నటించడం ఆపి ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని హితవు పలికారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :