ASBL Koncept Ambience
facebook whatsapp X

మా ప్రభుత్వం వచ్చాక తిరుమలలో ఎన్నో మార్పులు : ఆనం రామనారాయణరెడ్డి

మా ప్రభుత్వం వచ్చాక తిరుమలలో ఎన్నో మార్పులు : ఆనం రామనారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గతంలో సామాన్య భక్తులకు అనేక ఇబ్బందులు ఉండేవని చెప్పిన ఆయన.. ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ లేకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని వివరించారు. గతంలో తిరుమలలో ఎన్నో వివాదాలు ఉండేవని, ఇప్పుడు ఎలాంటి వివాదాలు ఏవీ లేకుండా టీటీడీ పాలన కొనసాగుతోందని ఆనం పేర్కొన్నారు. ప్రతి నెల తిరుమలకు వచ్చి భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయా? లేదా? అనేది కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామని తెలియజేశారు. అలాగే మఠాలు వ్యాపారాత్మక ధోరణిలో పనిచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :