ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆనంద్ దేవ‌ర‌కొండ చేతిలో క్రేజీ సినిమాలు

ఆనంద్ దేవ‌ర‌కొండ చేతిలో క్రేజీ సినిమాలు

జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా ఆనంద్ దేవ‌ర‌కొండ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ క‌థ‌ల‌ను ఎంచుకుని ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆనంద్ లైన‌ప్ చూస్తుంటే ఫ్యూచ‌ర్ లో అత‌న్నుంచి మ‌రిన్ని క్రేజీ సినిమాలు రానున్న‌ట్లు తెలుస్తోంది. దొర‌సాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవ‌రకొండ ఆ సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్నాడు.

త‌ర్వాత ప‌లు సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్లిన ఆనంద్ 2022లో బేబీ సినిమా చేసి కెరీర్లోనే బిగ్గెస్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ సినిమాకు బెస్ట్ యాక్ట‌ర్ గా సంతోషం అవార్డు అందుకోవ‌డంతో పాటూ ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఈ ఏడాది గంగం గ‌ణేశా సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌కరించిన ఆనంద్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి.

అందులో ఒక‌టి బేబీ ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్ గా డ్యూయెట్ కాగా, రెండోది మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్ట‌ర్ వినోద్ డైరెక్ష‌న్ లో సినిమా అని తెలుస్తోంది. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడ‌ట ఆనంద్. SKN, సాయి రాజేష్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఆనంద్ ఓ సినిమాకు సైన్ చేశాడ‌ని స‌మాచారం. ఈ నాలుగు సినిమాలూ డిఫ‌రెంట్ క‌థ‌ల‌తోనే తెర‌కెక్కనున్నాయ‌ట‌. త‌న మార్కెట్ ఎంతుందో తెలుసుకుని అలాంటి క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని అందుకుంటున్న ఆనంద్ క‌థ‌ల ఎంపిక డిఫ‌రెంట్ గా ఉంటుంద‌నే మాట ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :