ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2.. ప్ర‌తీ 10 నిమిషాల‌కీ ఓ హై మూమెంట్

పుష్ప‌2.. ప్ర‌తీ 10 నిమిషాల‌కీ ఓ హై మూమెంట్

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వ‌స్తోన్న పుష్ప‌2(Pushpa2)పై అభిమానులతో పాటూ సినీ ల‌వ‌ర్స్ లో కూడా మంచి అంచ‌నాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ‌వుతుందా, ఎప్పుడు పుష్ప రాజ్(Pushpa Raj) యుఫోరియాను ఎంజాయ్ చేద్దామా అని అల్లు ఫ్యాన్స్ చూస్తున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప‌2కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. పుష్ప‌1(Pushpa1)లో దాక్షాయ‌ణిగా న‌టించి త‌న మాస్ న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించిన అన‌సూయ(Anasuya) ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. పుష్ప‌2లో అన‌సూయ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా బిగ్ బాస్8(Bigg Boss8) దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్‌కు గెస్టుగా వ‌చ్చిన అన‌సూయ పుష్ప‌2 గురించి మాట్లాడింది.

పుష్ప‌2లో ప్ర‌తి 10 నిమిషాల‌కు ఆడియ‌న్స్ కు హై ఇచ్చే ఓ మూమెంట్ ఉంటుంద‌ని, ప్ర‌తీ సీన్ క్లైమాక్స్ లా ఉంటుంద‌నిపిస్తుంది. పుష్ప1 మొత్తం దాదాపు ఇంట్రోనే అని, అస‌లు క‌థ మొత్తం ఈ సినిమాలో ఉంటుంద‌ని, పుష్ప‌2 మ‌రింత డెప్త్ గా ఉంటుంద‌ని ఆమె వెల్ల‌డించింది. ఈ విష‌యం విన్న బ‌న్నీ ఫ్యాన్స్ సుకుమార్(Sukumar) పుష్ప‌2 కోసం గట్టి ప్లానే వేశాడ‌ని ఎగిరి గంతేస్తున్నారు. మొత్తానికి నాలుగు రోజుల‌కోసారి ఎవ‌రోఒక‌రు పుష్ప‌2 గురించి మాట్లాడి ఆ సినిమాకు ఉన్న హైప్ ను పెంచుతూనే ఉన్నారు. పుష్ప‌2 డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :