ASBL Koncept Ambience
facebook whatsapp X

యాంక‌ర్ సుమ చేతుల మీదుగా శంక‌ర్ ప‌ల్లిలో ఐశ్వ‌ర్య సిల్క్స్ ప్రారంభం...

యాంక‌ర్ సుమ చేతుల మీదుగా శంక‌ర్ ప‌ల్లిలో ఐశ్వ‌ర్య సిల్క్స్ ప్రారంభం...

ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ చేతుల మీదుగా షో రూం ప్రారంభం
స‌రికొత్త క‌లెక్ష‌న్లు, ఆక‌ట్టుకునే డిజైన్ల‌కు ఐశ్వ‌ర్య సిల్క్స్ కేరాఫ్ అడ్ర‌స్ 
గ్రేట‌ర్ ప‌రిధిలో 3 బ్రాంచ్ లుగా విస్త‌రించిన ఐశ్వ‌ర్య సిల్క్స్

క‌నువిందు చేసే కంచిప‌ట్టు చీర‌ల ప్ర‌త్యేక నిల‌యం ఐశ్వ‌ర్య సిల్క్స్ ఇప్పుడు శంక‌ర్ ప‌ల్లిలో కూడా అందుబాటులోకి వ‌చ్చింది. షో రూమ్ ఓపెనింగ్ బుధ‌వారం గ్రాండ్ గా జ‌రిగింది. ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ఐశ్వ‌ర్య సిల్క్స్ కొత్త స్టోర్ ను ప్రారంభించారు. షో రూం యాజ‌మాన్యం, సిబ్బంది, త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు. ఇప్ప‌టికే  హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లి, చందాన‌గ‌ర్ లో ఐశ్వ‌ర్య సిల్క్స్ స్టోర్స్ ఉన్నాయి. వాటికి ఇప్పుడు కొత్త‌గా మూడ‌వ‌ది జ‌త‌క‌ట్టింది.

వెరైటీ క‌లెక్ష‌న్లు, ఆక‌ట్టుకునే డిజైన్లకు కేరాఫ్ అడ్ర‌స్ ఐశ్వ‌ర్య సిల్క్స్. సాధార‌ణ చేనేత కుటుంబ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన నాగల‌క్ష్మి జొన్న‌గిరి దీన్ని ప్రారంభించారు. నేతకు, పట్టుకు ప్రసిద్ధి పొందిన ధర్మవరంలో ఆమె జన్మించారు. చేనేత కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచే ఆ ప్రభావం తనపై పడింది. అందుకే ఒక వైపు చదువుకుంటూనే.. మరోవైపు ఫ్యామిలీకి నాగలక్ష్మి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చారు. వివాహం అయిన తర్వాత కూడా చేనేతను వదిలిపెట్ట లేదు.. దాన్నే తన వ్యాపారానికి సోపానాలుగా మలుచుకున్నారు. అలా ధర్మవరంలో నేతన్నలను ఏకతాటి పైకి తీసుకొచ్చి ఒక చిన్న పరిశ్రమను నెలకొల్పారు. ఆ విధంగా ఐశ్వర్య సిల్క్స్ కు పునాదులు పడ్డాయి. తర్వాత అది అంచెలంచెలుగా అందమైన వ‌స్త్ర ప్రపంచంగా ఎదిగింది. మ‌గువ‌ల మ‌న‌సు దోచే స‌రికొత్త చీర‌లకు ఇది అస‌లైన చిరునామాగా మారింది. న‌మ్మ‌కానికి, నాణ్య‌త‌కు మారుపేరుగా నిలుస్తోంది.

అలాంటి స్టోర్ ను ఇప్పుడు శంక‌ర్ ప‌ల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కంచిప‌ట్టు, ముల్ కాట‌న్, మంగ‌ళ‌గిరి ప‌ట్టు, కాట‌న్, కాంజీవ‌రం సిల్క్, బ‌నార‌స్, ప‌టోలా, సాఫ్ట్ ప‌ట్టు, ఫ్యాన్సీ.. ఒక‌టేమిటి ఎలాంటి చీర‌లు కావాల‌న్నా ఐశ్వ‌ర్య సిల్క్స్ లో దొరుకుతాయి. క‌స్ట‌మ‌ర్లు వారికి న‌చ్చిన శారీస్ ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. వాటిని ధ‌రించి మిగ‌తా వారిక‌న్నా ప్ర‌త్యేకంగా క‌నిపించొచ్చు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :