రోడ్స్ స్కాలర్‌షిప్‌నకు ప్రవాసాంధ్రుడు అనీశ్ ఎంపిక
అత్యంత ప్రతిష్ఠాత్మక, పురాతన రోడ్స్ స్కాలర్‌షిప్‌నకు ప్రవాసాంధ్ర విద్యార్థి అనీశ్ ముప్పిడి ఎంపికయ్యారు. యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేందుకు హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యేల్, ఎంఐటీ తదితర ప్రపంచ అగ్రశ్రేణి వర్సిటీల నుంచి సుమారు 3 వేల మంది విద్యార్థులు పోటీపడ్డారు. పలు విడతల వడపోత అనంతరం చివరకు 32 మంది ఎంపికయ్యారు. వారిలో ఎన్‌ఆర్‌ఐలు నలుగురు ఉండగా, అందులో తెలుగు మూలాలున్న 21 సంవత్సరాల అనీశ్ ఒకరు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. వచ్చే ఏడాది మే నెలకు చదువు పూర్తికానుంది. అక్టోబరులో ఆక్స్‌ఫర్డ్‌లో చేరనున్నారు. అశీన్ ఎంపిక పట్ల తల్లిదండ్రులు రాణి, వీవీ రాంరెడ్డి ముప్పిడి ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడేనికి చెందిన వారు అమెరికాలో స్థిరపడ్డారు.