అయోవా రాష్ట్రంలోని జైల్లో అన్మోల్ బిష్ణోయ్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని పొట్టవాట్టయ్ కౌంటీ జైలుకు తరలించారు. ఇతడిపై పంజాబ్, ముంబయి, ఢిల్లీలో దాదాపు 20 కేసులు ఉన్నాయి. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. తొలుత అన్మోల్‌ను కాలిఫోర్నియాలో అరెస్టు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ, తాజాగా అతడు అయోవా రాష్ట్రంలోని జైల్లో ఉన్నట్లు తేలింది. అతడి వద్ద ఉన్న ఇండియన్ పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని భారత దౌత్య అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అమెరికాలోని ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో టచ్‌లో ఉంది. అతడిని తమకు అప్పగించాలని ఎన్‌ఐఏ అభ్యర్థించింది. అమెరికాలో కోర్టు వ్యవహారాలు లేకుండా అతడిని నేరుగా భారత్‌కు తరలించేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.