ASBL Koncept Ambience
facebook whatsapp X

అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంద్రాగస్టు రోజున అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆగస్టు 15న సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజు (ఆగస్టు 16న) మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని నారాయణ వెల్లడిరచారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :