ASBL Koncept Ambience
facebook whatsapp X

AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. మరి జగన్ నిర్ణయం ఏమిటో?

AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. మరి జగన్ నిర్ణయం ఏమిటో?

2024 ఎన్నికల తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈసారి జరగబోతున్న శీతాకాల సమావేశాలు నవంబర్ రెండు లేక మూడవ వారంలో ప్రారంభమయ్యే అవకాశం. ఇది డిసెంబర్ మొదటి లేక రెండవ వారంలో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు( Ayyanna Patrudu) ..ప‌య్యావుల కేశ‌వ్ (payyavula keshav)సభా కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. వీరు తీసుకున్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandra Babu) విన్నవించిన తర్వాత ఆయన సభ ఎప్పటినుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి అనే విషయంపై ఫైనల్ నిర్ణయాన్ని తీసుకుంటారు.

అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా ఈ సభలో వైసీపీ అధినేత పాల్గొంటారా లేదా అనే విషయం చుట్టూ వార్త‌లు గిరికీలు కొడుతున్నాయి. ఈసారి జరగబోయే సమావేశాల(Ap assembly session) విషయంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు సమావేశాలకి వస్తారా? లేక ఏదైనా కారణం చెప్పి తప్పించుకుంటారా? అన్న విషయాలు ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారాయి. ఇప్పటివరకు నిర్వహించిన రెండు సభలలో ఒక్కసారి కూడా జగన్ పూర్తిగా సభకు హాజరు కాలేదు. 

ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా.. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని జగన్ గతంలో తెగ వాపోయారు. ఇక ఈ వివాదం హైకోర్టు వరకు చేరడంతో.. జగన్ చేస్తున్న డిమాండ్స్ అందరికీ విచిత్రంగా కనిపించాయి. ఇంకా కోర్ట్ ఈ విషయంపై ఎటువంటి తీర్పు ఇవ్వలేదు.. ఈ విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది అన్న విషయంపై కూడా ఎవరికి స్పష్టత లేదు. దీంతో జగన్ మళ్ళీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా విషయాన్ని ఎలివేట్ చేస్తారా లేక సభకు హాజరవుతారా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జగన్ ముందు ఉన్న ఆప్షన్స్ రెండు.. ఒకటి సభలకు వెళ్లకుండా కేవలం సభ్యులను మాత్రం సభకు పంపించడం. అయితే దీనివల్ల ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఇక మిగిలిన రెండవ ఆప్షన్ అందరితో కలిసి సభకు వెళ్లడం. ఇది చేయడం నిజంగా పులి నోట్లో తలపెట్టడంతో సమానం.. జగన్ ఎప్పుడు దొరుకుతాడా ప్రశ్నలతో దాడికి సిద్ధపడుదాం అని కూటమి నేతలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :