ఏపీ కేబినెటీ భేటీ .. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆంద్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014`18 మధ్య నీరు, చెట్టు పెండిరగ్ బిల్లుల చెల్లింపులకు ఆమోదం చెప్పింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు. ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చారు. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యా సంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్‌అండ్‌టీ ఫెసిలిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తామన్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఎక్సైజ చట్ట సవరణ ముసాయిదాకు, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యాల సాధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం. సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఆమోదం. సీఆర్డీఏ పరిధిలోకి పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి 154 గ్రామాలు. 11 మండలాల్లోని 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఆమోదం. జ్యుడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంచుతూ ఆమోదం. 2014 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.