ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీ క్యాబినెట్ భేటీ.. సీఆర్ డీఏ ప‌రిధి పెంపు..

ఏపీ క్యాబినెట్ భేటీ.. సీఆర్ డీఏ ప‌రిధి పెంపు..

చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన ఏపీ క్యాబినెట్ పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా రాజధాని అయిన అమరావతి పరిధిని ప్రధానంగా పెంచుతూ.. ఇటు విజయవాడ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలను.. అటు గుంటూరు, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను దీని కిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తంగా సీఆర్ డీఏ ప‌రిధి సుమారు 8,352 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్లు పెరిగింది. అంటే ఇప్పుడు ఆ ప్రాంతాలు కూడా రాజధాని పరిధిలోకి వస్తాయన్నమాట. 

అంతేకాదు ఈ ప్రాంతాల భూముల రేట్లు పెరగడంతో పాటు ఇతర వ్యాపార ,వాణిజ్య కార్యక్రమాల విస్తరణ కూడా అధికంగా సాగుతుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ హయాంలో చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన పలు బిల్లులను కూడా చెల్లించే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో 2014-18 మధ్య సమయంలో పచ్చదనాన్ని పెంచాలి అని ప్రధాన లక్ష్యంతో నీరు చెట్టు కార్యక్రమాన్ని అప్పట్లో టీడీపీ ప్రవేశపెట్టింది. అయితే దానికి సంబంధించిన కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని.. నిజానికి వైసీపీ ప్రభుత్వం హయాంలో వీటిని చెల్లించాల్సి ఉన్నప్పటికీ..జగన్ తన కక్ష సాధింపు వైఖరి కారణంగా బిల్లులు పెండింగ్ పెట్టారని తెలిపిన మంత్రివర్గం ఈ బిల్లులకు పేమెంట్ కు సంబంధించి ఆమోదాన్ని తెలియజేసింది.

ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రీఫెల్‌ బిల్లుల‌కు కూడా క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది.అదేవిధంగా ఏపీ జీఎస్టీ-2024 చట్ట సవరణ పై కూడా మంత్రివర్గంలో చర్చ జరగడం తో దీనికి ఆమోదం లభించింది. దీని కారణంగా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తానికి రాష్ట్రస్థాయిలో కొన్నిటిపై పన్ను తగ్గితే మరికొన్నిటిపై పెరిగే అవకాశం ఉంది. ఈ సవరణ ద్వారా ప్రస్తుతం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానంలో కల్లుగీత కార్మికులకు ప్రత్యేకంగా షాపులు కేటాయించే అవకాశం కుదురుతుంది. అలాగే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం.. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఏరియాలో కూడా అభివృద్ధి పనులు చురుకుగా సాగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :