AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ... నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu) అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024`29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలివే :
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం. పొట్టి శ్రీరాములు (potti sriramulu) వర్థంతి ( డిసెంబరు 15)ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు ఆమోదం. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్‌లో పాలసీకి ఆమోదం. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.