ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవర టికెట్ రేట్ల పెంపు..! నాటికి, నేటికి ఎంత తేడా..?

దేవర టికెట్ రేట్ల పెంపు..! నాటికి, నేటికి ఎంత తేడా..?

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ ఇప్పుడు హాలీవుడ్ (Hollywood) స్థాయికి ఎదిగింది. ఎన్నో సినిమాలు (Cinema) ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్నాయి. సినిమాల బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో సాధారణరేట్లతో లాభాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకే సినిమా నిర్మాతలు (Cinema producers) రిలీజ్ సమయంలో తమ సినిమాకు రేట్లు పెంచాల్సిందిగా ప్రభుత్వాలను కోరుతూ ఉంటారు. గతంలో ఇలా సినిమా టికెట్ (Ticket Rates0 రేట్ల పెంపుపై ఏపీలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇండస్ట్రీని వైసీపీ సర్కార్ (YCP Govt) ముప్పతిప్పలు పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన వకీల్ సాబ్ (Vakilsaab) సినిమా అనేక వివాదాలకు కారణమైంది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలు (Benefit Show), టికెట్ ధరల పెంపునకు అప్పటి వైసీపీ ప్రభుత్వం నిరాకరించింది. ఇది పవన్ ఫ్యాన్స్ (Pawan Fans) ఆగ్రహానికి కారణమైంది. చివరకు కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం (YS Jagan) సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోలపై అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టికెట్లు అమ్మే విధానాన్ని తీసుకొచ్చింది. సినిమా పెద్దలను కూడా జగన్ అవమానించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) గత ఐదేళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొందనేది ఇండస్ట్రీ పెద్దల మాట.

ఇప్పుడు ఎన్టీఆర్ (Jr.NTR) నటించిన దేవర (Devara) సినిమా విడుదలకు సిద్ధమైంది. తమకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతించాలని సినిమా యూనిట్ కోరగానే చంద్రబాబు (Chandrababu) సర్కార్ అందుకు అనుమతించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి, ఎన్టీఆర్ ఫ్యామిలీకి (NTR Family) దూరం ఉన్న మాట జగమెరిగిన సత్యం. అయినా ఎన్టీఆర్ సినిమాపై కక్షసాధించాలని ప్రభుత్వం ఆలోచించలేదు. అడిగిన వెంటనే ఓకే చెప్పింది. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ ద్వారా వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీకి ఎన్డీయే (NDA) ప్రభుత్వం అండగా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చారు. దేవర సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దేవర సినిమా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు చంద్రబాబు సర్కార్ అనుమతించగానే సోషల్ మీడియాలో (Social Media) హర్షం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా నందమూరి ఫ్యాన్స్ (Nandamuri) కు, జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ కు మధ్య వార్ జరుగుతోంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ప్రభుత్వంలాగా ఇబ్బందులు పెట్టకుండా అడగ్గానే అనుమతించారని.. ఇండస్ట్రీకి ఇలాంటి నిర్ణయాలు ఎంతో మేలు చేస్తాయాని పొగుడుతున్నారు. మొత్తానికి దేవర సినిమా నాటి ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తు చేస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :