ASBL Koncept Ambience
facebook whatsapp X

రాష్ట్రంలో మొదలైన పెట్టుబడుల వరద... ఉద్యోగాల జాతర!

రాష్ట్రంలో మొదలైన పెట్టుబడుల వరద... ఉద్యోగాల జాతర!

ఎస్ఐపిబి తొలి సమావేశంలో రూ.85వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ 
34వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతులు, భూములు

అమరావతి: రాష్ట్రంలో 5నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైంది. అయిదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారు. చంద్రబాబునాయుడు 4.0 రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్నపాదయాత్ర సమయంలో లోకేష్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. ఆయన చెప్పినట్లుగానే మిట్టల్ స్టీల్స్, రిలయన్స్ రెన్యువబుల్ ఎనర్జీ, టిసిఎస్, సెరెంటికా గ్లోబల్ వంటి భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూకట్టాయి. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఆదిత్య మిట్టల్ తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో భారీపెట్టుబడులకు ఆ సంస్థను ఒప్పించారు. ముంబాయిలో రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలతో చర్చలు జరిపి బయో ఇంధన రంగంలో 65వేల కోట్ల పెట్టుబడులకు వారిని ఒప్పించారు.

టిసిఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 45నిమిషాల భేటీతో విశాఖలో 10వేల ఉద్యోగాల కల్పించే టిసిఎస్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపిబి) సమావేశంలో రూ. 85వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతోపాటు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రీస్టార్ట్ ఎపిలో ఇది తొలి అడుగు. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా ఎస్ఐపిబి తొలి సమావేశంలోనే యువతకు 34వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేయడం మంత్రి లోకేష్ సత్తా, సామర్థ్యానికి నిదర్శనం. రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఎపివైపు చూసేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 10 భారీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ జెవి నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (క్యాప్టివ్ పోర్టుతో కలిపి) తొలిదశ నిర్మాణానికి రూ.61, 780 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.  2029నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి, 21వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.5001 కోట్లు (1495 ఉద్యోగాలు), కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్  రూ.1430కోట్లు (565 ఉద్యోగాలు), టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.76కోట్లు (250 ఉద్యోగాలు), ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ.3,798 కోట్లు (200 ఉద్యోగాలు), అజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1046కోట్లు (2,381 ఉద్యోగాలు), డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్ పి రూ. 50కోట్లు (2వేల ఉద్యోగాలు), ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.8,240 కోట్లు (4వేల ఉద్యోగాలు), గ్రీన్ కో సోలార్ ఐఆర్ఇపి ప్రైవేట్ లిమిటెడ్ రూ.2వేల కోట్లు (1725 ఉద్యోగాలు), ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1662 కోట్లు (350 ఉద్యోగాలు) సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సహకాలు ఉంటాయి.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :