ASBL Koncept Ambience
facebook whatsapp X

2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ..! జాతరే జాతర..!!

2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ..! జాతరే జాతర..!!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. మొదటి 2 నెలలు తాము ఇచ్చిన గ్యారంటీల అమలుకు, అధికారుల బదిలీలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. మూడో నెలలో వరదలు ముంచెత్తడంతో పూర్తిగా సమయం దానికే కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటూ ఉండడంతో పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా మొదట నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిపైన కసరత్తు కూడా పూర్తయింది. 2-3 రోజుల్లోనే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమైనట్టు సమాచారం.

ఏపీ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఆయా పార్టీల బలాబలాల ఆధారంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని మూడు పార్టీలూ ఇప్పటికే అంగీకారానికి వచ్చాయి. అందులో భాగంగా టీడీపీకి 60శాతం, జనసేనకు 30శాతం, బీజేపీకి 10శాతం పోస్టులు దక్కుతాయి. ఈ మేరకు వాళ్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి ఎవరికి పదవులు ఇవ్వాలనేదానికి సంబంధించి లిస్టు కూడా చంద్రబాబుకు అందినట్టు తెలుస్తోంది. ఆయా పేర్లను పరిగణనలోకి తీసుకుని జాబితాను అనౌన్స్ చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8వందల నామినేటెడ్ పోస్టులున్నాయి. ఇందులో 6 వందల వరకూ రాష్ట్రస్థాయి పోస్టులున్నాయి.

నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు భారీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పార్టీకోసం త్యాగం చేసిన వాళ్లున్నారు. అలాంటి వాళ్లలో దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీతల సుజాత, కిడారి శ్రవణ్, కిమిడి నాగార్జున, కోరాడ బాబ్జీ, వలవల బాబ్జీ, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆనం వెంకట రమణా రెడ్డి, వెంకట్ రెడ్డి, గొంప కృష్ణ, దామచర్ల సత్యలకు నామినేటెడ్ పదవులు పక్కాగా దక్కుతాయని భావిస్తున్నారు. పిఠాపురం వర్మ, ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇక టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీ 5 ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే అశోక గజపతి రాజు లేదా రఘురామ కృష్ణంరాజు లేదంటే బీజేపీ నుంచి ఎవరైనా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆ పదవి దక్కుతుందని భావిస్తున్నారు.

జనసేన నుంచి కూడా పలువురు నేతలకు కీలక పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. షేక్ రియాజ్, రాయపాటి అరుణ, కిరణ్ రాయల్ తదితరులకు పక్కాగా పోస్టులు వరిస్తాయని అంచనా. జనసేనకు చెందిన 10 మందికి రాష్ట్రస్థాయి పోస్టులు వరించవచ్చని తెలుస్తోంది. బీజేపీ నుంచి బారీగా ఆశావహులున్నారు. అయితే పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వాలని హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించింది. ఆ మేరకు జాబితాను కూడా చంద్రబాబుకు పంపించింది. బీజేపీ తరపున ఎవరిని నామినేట్ చేశారనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ వారంలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :