ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆంధ్ర సర్కార్ వర్సెస్ అధికారులు.. ఇదేమి చోద్యం సామి…

ఆంధ్ర సర్కార్ వర్సెస్ అధికారులు.. ఇదేమి చోద్యం సామి…

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈనాటికీ 50 రోజులకు పైగా అవుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి మధ్య ఇంకా సమన్వయం కుదిరినట్లు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని అటు చంద్రబాబుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించడం విశేషం. ఏ ప్రభుత్వం ఎరుగన్నటువంటి సరికొత్త చిక్కుముడి కూటమి ప్రభుత్వం ముందు ఏర్పడింది. అధికారులు తమ మాట వినడం లేదని.. తాము ఒకటి అడిగినప్పుడు వారు వేరేవి ప్రస్తావిస్తున్నారని.. ఇటువంటి సమయంలో అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదని నేతలు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలను కూడా మార్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గడుస్తున్నా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వానికి పట్టు చిక్కకపోవడం అందరికీ పెద్ద భేతాళ ప్రశ్నగా మారింది. 

సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన పది నుంచి 15 రోజుల లోపల అధికారులు దారిలోకి వస్తారు. ప్రభుత్వం ఎలా చెబితే అలా వాళ్ళు నడుచుకుంటారు. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఉన్న కెసిఆర్ సర్కార్ తర్వాత రేవంత్ సర్కారు వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలోపు ఉద్యోగులందరూ కొత్త ప్రభుత్వం వైపుకు వచ్చేశారు. మరి అలాంటిది ఆంధ్రాలో మాత్రం ఎందుకు అటువంటిది కనిపించడం లేదు అనేది ఆలోచించాల్సిన విషయం.

14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా.. ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అనుభవం కడించిన చంద్రబాబు లాంటి అపర రాజకీయ దురంధరుడు కి ఇటువంటి చిక్కు ఎదురు కావడం విడ్డూరంగా ఉంది. మరోపక్క క్షేత్రస్థాయిలో కొందరు టీడీపీ నేతలు పార్టీ పెద్దల మాటలు పట్టించుకునే స్థితిలో లేరు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనేక అల్లర్లు, హత్య రాజకీయాలు వీటికి నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అన్నిటిపై నియంత్రణ తీసుకు రాకపోతే కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రతిపక్షం దక్కని ప్రతిపక్ష నేత.. ఈ విషయాలను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం బలంగా కనిపిస్తుంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :