మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు... హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకున్న ఘటనలో వెలగపూడికి చెందిన మరియమ్మ మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తుళ్లూరు ఠాణలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందిగం సురేశ్‌ను పోలీసులు 78వ నిందితుడిగా చేర్చారు. బెయిలు మంజూరు చేయాలని చేసిన అభ్యర్థను గుంటూరు కోర్టు తీసిపుచ్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సురేశ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Tags :