Home Minister Anita: వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు : హోంమంత్రి అనిత
గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత(Anita) విమర్శించారు. విజయవాడ (Vijayawada) లో సబ్‌జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారమిచ్చారు. ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా నిఘా ఉంటుంది. చర్యలు తప్పువు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీశాం. జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించాం. విచారణ జరుగుతోంది. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది. దానిపై త్వరలో చర్యలు తీసుకుంటాం అన్నారు.
తమ తప్పులు బయట పడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదు. విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోంది. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించారు. జగన్ అండ్ కో ఏపీ సంపదను దోచుకున్నారు అని విమర్శించారు.