ASBL NSL Infratech
facebook whatsapp X

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గుర్తింపు ...

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గుర్తింపు ...

అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ సేద్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్‌ అవార్డు ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఒక శాస్త్రవేత్త, మరో సంస్థతో కలిసి ఏపీసీఎన్‌ఎఫ్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్‌, మహిళా రైతు నాగేంద్రమ్మ నెట్టం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతి అమెరికన్‌ శాస్త్రవేత్త రతన్‌లాల్‌, ఈజిప్టుకు చెందిన సెకెమ్‌ స్వచ్ఛందసంస్థకూ అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే ఒక మిలియన్‌ యూరోల  నగదు బహుమతిని ముగ్గురు విజేతలకు సమానంగా పంచుకున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి ఏపీసీఎన్‌ఎఫ్‌ ఈ అవార్డు దక్కించుకుంది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :