ASBL Koncept Ambience
facebook whatsapp X

Sajjala Rama Krishna Reddy: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సజ్జల ను అడ్డగించిన అధికారులు.. 

Sajjala Rama Krishna Reddy:  ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సజ్జల ను అడ్డగించిన అధికారులు.. 

2024 ఎన్నికల ఓటమి అనంతరం వైసీపీ (YCP ) నేతలకు ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. ఏదో ఒక కేసు విషయంలో వైసీపీ ముఖ్య నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కూడా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ (Delhi Airport) లో కేసు విషయంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కేసుల దాడి భరించలేక ఎందరో ఇప్పటికే విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారి బాటలోనే సజ్జల కూడా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించి ఇమిగ్రేషన్ అధికారుల చేతికి చిట్కాలు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ బాగోతం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు (look out notice on Sajjala) జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సజ్జన విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో సజ్జల పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సజ్జలతో పాటుగా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం నిందితుల లిస్టులో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నిందితుల విచారణ పూర్తయింది.. ఈ నేపథ్యంలో వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సజ్జలను 120 ముద్దాయిగా గుర్తిస్తూ ఛార్జ్ షీట్ లో పేరును జత చేశారు. అనంతరం మంగళగిరి పోలీసులు సజ్జలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా రెండు రోజుల క్రితం విదేశాలకు వెళ్లడానికి సజ్జల ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టులోని ఇమిగ్రేషన్ అధికారులు సజ్జలను అడ్డుకున్నారు. అయితే ఈ విషయంపై సజ్జల వాదన మరోరకంగా ఉంది.. తాను విదేశాలకు వెళ్లలేదని కేవలం దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నానని.. అయితే తన మీద కుట్రతో దీన్ని కూడా అడ్డుకోవడానికి ఏర్పోర్ట్ అధికారులు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం విదేశాలకు వెళ్తున్నట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉండడం తో అడ్డుకోవడానికి ప్రయత్నించామని పేర్కొంటున్నారు. అంతే కాదు దేశంలో ఎక్కడికి వెళ్లినా తమకు ఇబ్బంది లేదని కానీ దానికి సంబంధించిన టికెట్లు వివరాలను మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో అక్కడ చిన్న వాగ్వాదం కూడా జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి సజ్జల ఈరకంగా ఢిల్లీలో బుక్ అయిపోయారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :