ASBL Koncept Ambience
facebook whatsapp X

2025 తానా కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ నియామకం

2025 తానా కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ నియామకం

డిట్రాయిట్లో 2025, జూలైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్ 2025కి రంగం సిద్ధమైంది. Novi Suburban Showplace లో జరిగే ఈ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేసినట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. 

తానా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఎ), శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ మరియు ఇండియా లీగ్ ఆఫ్ అమెరికాలో పలు నాయకత్వ బాధ్యతలో పాటు, తానా 2005, 2015 సమావేశాలు, డిటిఎ 25వ, 40వ వార్షికోత్సవాలు సమర్ధవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న ఈ  కమిటీ  సభ్యులు, సెప్టెంబర్ 2024 చివరి నాటికి ప్రణాళిక నివేదికను అందిస్తుందన్నారు. 

అలాగే అక్టోబర్ 19, 2024న కిక్ఆఫ్ ఈవెంట్ ను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. 

ఈ కాన్ఫరెన్స్ కు వాలంటీర్లుగా పనిచేయాలనుకునేవారు https://www.tanaconference.org/ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చని కూడా ఆయన తెలిపారు. 

కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీలో సభ్యులు వీరే :

గంగాధర్ నాదెళ్ల (చైర్మన్) - నిధుల సేకరణ
శ్రీనివాస్ కోనేరు (కెవికె) (కో-కోఆర్డినేటర్) - ఆర్ధిక, ఆదాయ విభాగాలు 
సునీల్ పాంట్ర (కాన్ఫరెన్స్ డైరెక్టర్) - సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు
కిరణ్ దుగ్గిరాల (కార్యదర్శి) -  ప్రణాళికా సమన్వయం 
జోగేశ్వరరావు పెద్దిబోయిన (కోశాధికారి) -  వేదిక, హోటళ్లు మరియు భోజన ఏర్పాట్లు
నీలిమ మన్నె (తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి) - పోటీలు, అలంకరణలు, మహిళలు, మరియు పిల్లల కార్యకలాపాలు

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :