ASBL Koncept Ambience
facebook whatsapp X

అదే బీఆర్‌ఎస్‌ విధానమైతే.. ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు

అదే బీఆర్‌ఎస్‌ విధానమైతే.. ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు

పీఏసీ చైర్మన్‌ అరికెపూడి గాంధీ స్టేషన్‌ అరికెపూడి గాంధీ స్టేషన్‌ బెయిల్‌పై నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. నన్ను ఆహ్వానిస్తేనే కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లా. కానీ, మాపై దాడి చేశారు. కౌశిక్‌ భార్య విల్లాపై నుంచి కుండీ, మొక్కలు మా కార్యకర్తలపై విసిరేశారు.  40 మంది నన్ను అడ్డుకున్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కౌశిక్‌ ప్రయత్నించారు. నన్ను ఆంధ్రా వాడు అన్నారు. అదే బీఆర్‌ఎస్‌ విధానమైతే పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పార్టీ అధినేత కేసీఆర్‌ కౌశిక్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు గాంధీకి సంఫీుబావం తెలిపారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :