ASBL Koncept Ambience
facebook whatsapp X

నవంబర్‌ 14 నుంచి కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవాలు : భట్టి

నవంబర్‌ 14 నుంచి కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవాలు : భట్టి

కాంగ్రెస్‌ పార్టీ ఏడాది పాలనపై నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా విజయోత్సవాలు ఏవిధంగా జరపాలి. ఏ అంశాలపై ప్రచారం చేయాలనే దానిపై విధివిధానాలు రూపొందించేందుకు భట్టి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ఉత్సవాల నిర్వహణపై జరిగిన సబ్‌కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోవడంతోపాటు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు వరకు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించింది.

విజయోత్సవాల్లో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ 25 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలతో పాలు పలు కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ప్రజలకు ఈ కార్యక్రమాల  ద్వారా వివరించనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు ఈ సంబరాలు నిర్వహిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. భేటీ అనంతరం భట్టి మాట్లాడుతూ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రి, స్పోర్ట్స్‌ వర్సిటీకి శంకుస్థాపన చేస్తాం. 28న పారామెడికల్‌, 16 నర్సింగ్‌ కళాశాలలను ప్రారంభిస్తాం. ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలో ఒప్పందాలు చేసుకుంటాం. గ్రూప్‌`4కు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తాం. డిసెంబర్‌ 9న హైదరాబాద్‌లో భారీగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తాం అని తెలిపారు.

 


 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :