ASBL Koncept Ambience
facebook whatsapp X

టిఎల్‌సిఎ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌లో కళాప్రదర్శనలు

టిఎల్‌సిఎ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌లో కళాప్రదర్శనలు

న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ వద్ద జరిగిన తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌ లో వివిధ కళా ప్రదర్శనలను కళాకారులు ప్రదర్శించి అందరి మన్ననలను అందుకున్నారు. పౌరాణిక పాత్రలను ధరించడంలో, నాటకాలను వేయడంలో పేరుపొందిన అశోక్‌ చింతకుంట, మాధవి సోలేటి దంపతులు ఈ కార్యక్రమాన్ని కూడా విజయ వంతం చేయడంలో కృషి చేశారు. రాణి రుద్రమదేవి వేషాన్ని మధుదనికొండ, శ్రీ కృష్ణ దేవరాయ పాత్రను సత్య చల్లపల్లి, అల్లూరి సీతారామరాజు పాత్రను సంతోష్‌ తూనికుంట్ల, మహాభారతం మాయాజూదం నాటికలో దుర్యోధన పాత్రను దుర్గ ధనికొండ, శకుని పాత్రను అశోక్‌ చింతకుంట పోషించారు. మాధవిసోలేటి అవసరమైన కాస్ట్యూమ్స్‌ను అందించారు. ఎల్లమ్మ జానపద నృత్యానికి ఉమ పుతనే కొరియోగ్రఫీ చేశారు. 

టిఎల్‌సిఎ ప్రెసిడెంట్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి పర్వతాల, వారి ఇసి టీమ్‌ అశోక్‌ చింతకుంటకు, మాధవి సోలేటికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పౌరాణికాలకు మంచి స్పందన వచ్చిందని వారు తెలియజేశారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :