ASBL Koncept Ambience
facebook whatsapp X

AP volunteers: విధుల్లోకి తీసుకుంటామని.. వాలంటీర్లను వీధుల్లో వదిలేసిన కూటమి..

AP volunteers: విధుల్లోకి తీసుకుంటామని.. వాలంటీర్లను వీధుల్లో వదిలేసిన కూటమి..

2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత జగన్ ఆంధ్రాలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఇటువంటి వాటిలో వాలంటీర్ వ్యవస్థ (Volunteers) ఒకటి. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆంధ్రాలో వాలంటీర్లు (Andhra Volunteers) అంటే ఓ బ్రాండ్.. జగన్ రథసారదులుగా ఓ ఇమేజ్ ఉండేది. ఎన్నికలకు ముందు ఈ వ్యవస్థ పై కూటమి ప్రశ్నలు లేవనెత్తింది.. అయితే ఆంధ్రాలో వాలంటీర్ల సంఖ్య దండిగా ఉండడంతో ఎన్నికల్లో గెలుపు కోసం వారిని విధుల్లోకి తీసుకుంటామని.. జీతం కూడా రెండింతలు పెంచుతామని ప్రచారం చేసింది. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారిని పట్టించుకున్న దాఖలు లేదు.

దీంతో ఇప్పుడు ఆంధ్రాలో పాపం వాలంటీర్లు అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు ఆ తరువాత చేతలకు చాలా తేడా ఉండడంతో వాలంటీర్లు కొన్నిచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమాషా ఏమిటంటే ఎక్కడ వాలంటీర్ల నిరసన వైరల్ అవ్వడం లేదు.. వారి ఉద్యమాల ఊసే ప్రజల వద్దకు రావడం లేదు. ఈ నేపథ్యంలో అసలు వాలంటీర్లు చేసిన పాపం ఏమిటి.. ఎందుకని వారిపై ఇంత సీత కన్ను విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. గడచిన ఐదు సంవత్సరాల లో వైసీపీ (YCP) ..జగన్(Jagan) ముద్ర తీసి పక్కన పెడితే వాలంటీర్ల వల్ల మంచే జరిగింది. కేవలం జగన్ ప్రవేశపెట్టిన వ్యవస్థగా తప్ప.. ఏ రకంగా వారిపై ఎటువంటి చెడ్డ ఇమేజ్ లేదు. ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు మంచిగానే సేవలు అందించారు.

పుచ్చుకున్న జీతం 5000 రూపాయలు అయినప్పటికీ…ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న గవర్నమెంటు అధికారుల కంటే కూడా ఎక్కువగా స్పందించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి పరిష్కారం చూపించడం.. పెన్షన్లు అందించడం దగ్గర నుంచి కరోనా(Covid ) సమయంలో కూడా సేవలు అందించారు. బర్త్ సర్టిఫికెట్(Birth certificate) దగ్గర నుంచి డెత్ సర్టిఫికెట్ (Death certificate) వరకు.. ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి ప్రజల వ్యక్తిగత సమస్యల వరకు ఎన్నిటికో వాలంటీర్లు బాసటగా నిలిచారు. కానీ ఇప్పుడు వారి కష్ట కాలంలో వారి పక్కన నిలబడే వారు కనిపించడం లేదు. మరికొందరు జగన్ అప్పుడు అమరావతి(Amaravathi ) విషయంలో చేసిన తప్పు.. ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) వాలంటీర్ వ్యవస్థ విషయంలో చేస్తున్నారేమో అని కూడా విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బాబు ఈ విషయంలో సత్వరం ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :