ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu: విమర్శలకు చంద్రబాబు చెక్ పెట్టబోతున్నారా..!?

Chandrababu: విమర్శలకు చంద్రబాబు చెక్ పెట్టబోతున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ మధ్యకాలంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పరిపాలనలో మార్పులు, చేర్పులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పాత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లను తప్పించడం, వాళ్ల స్థానంలో కొత్తవాళ్లకు బాధ్యతలివ్వడం లాంటివి చేపట్టారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్పులు, చేర్పుల తర్వాత కూడా పలువురు వైసీపీ (YSRCP) అనుకూల అధికారులు, ఉద్యోగులు, కన్సల్టెంట్లు చక్రం తిప్పుతున్నారని తెలుగు తమ్ముళ్లు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇలాంటి వాటిపై పనుస్సమీక్షించే ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు.

జగన్ (YS Jagan) అధికారంలో ఉన్న ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్లపై కేసులు (cases) పెట్టారు. వాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని భావించారు. తమను ఇబ్బంది పెట్టిన నేతలు, అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకుంటుందని ఆశించారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అలాంటిదేమీ జరగలేదు. కక్షసాధింపు చర్యలు వద్దంటూ తెలుగు తమ్ముళ్లకు హితవు పలికే ప్రయత్నం చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లందరికీ పుండుమీద కారం చల్లినట్లయింది. లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లింది మేం కాబట్టి ఆ నొప్పి మాకే తెలుస్తుందని.. మీకేం తెలుస్తుందని ఎదురు తిరగడం మొదలు పెట్టారు. లోకేశ్ (Nara Lokesh) రెడ్ బుక్ (Red book) ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో (Social Media) చంద్రబాబు నాలుగు నెలల ప్రభుత్వ పనితీరుపై  స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకూ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించబోతున్నారు. 18న పార్టీ ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలతో (MLCs) సమావేశం కాబోతున్నారు. 20న టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం.. 2019 నుంచి 2024 వరకూ ఉన్న జిల్లా ఇన్ ఛార్జ్ లతో సమావేశమవనున్నారు. గత ఐదేళ్లలో ఎదుర్కొన్న సమస్యలు, కేసులు.. లాంటి వాటిపై స్వయంగా ఆరా తీయనున్నారు. అంతేకాక పార్టీ నిర్మాణంపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. రాష్ట్ర, జిల్లా, మండల కమిటీలపై తగిన సూచనలు చేయనున్నారు.

మొత్తానికి చంద్రబాబు తమ మొర ఆలకించబోతున్నారని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. సహజంగా చంద్రబాబు అధికారంలోకి రాగానే పార్టీ కార్యకలాపాలపై పెద్దగా దృష్టి సారించరు. పూర్తిగా రాష్టాభివృద్ధిపైనే ఫోకస్ పెడతారు. కానీ ఈసారి చంద్రబాబు అలా చేయట్లేదు. ప్రభుత్వంతో పాటు పార్టీపైన కూడా ఎక్కువ దృష్టిసారించారు. పార్టీ కార్యాలయంలో నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేలా కార్యాచరణ చేపట్టారు. చంద్రబాబు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఇప్పడు నేరుగా పార్టీ నేతలందరితో సమావేశం కానుండడంతో కచ్చితంగా తమకు మేలు చేస్తారని ఆశిస్తున్నారు. మరి చూడాలి చంద్రబాబు ఏం చేస్తారో..!?

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :