ASBL NSL Infratech

చంద్రబాబు గారూ.. మీరు మారిపోయారు సర్..!!

చంద్రబాబు గారూ.. మీరు మారిపోయారు సర్..!!

చంద్రబాబు అనే పని రాక్షసుడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కూడా నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ ఎప్పుడూ పని పని అని పరుగెత్తించేవారు. దీంతో ఆయన దగ్గర పనిచేయాలంటే అమ్మో అని భయపడుతుంటారు అధికారులు. వారాలతో, పని గంటలతో సంబంధం లేకుండా ఆయన నిత్యం సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా ఉంటారు. అన్నీ తానై నడిపించేస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు దీనికి పూర్తి విరుద్దంగా కనిపిస్తున్నారు. కూల్ గా ఉంటున్నారు. అధికారులను చుట్టూ పెట్టుకుని తిప్పుకోకుండా సూటిగా, స్పష్టంగా, సింపుల్ గా తేల్చేస్తున్నారు. చంద్రబాబును ఇప్పుడు చూస్తున్న వారంతా మీరు మారిపోయారు సర్ అంటున్నారు.

చంద్రబాబు ఇప్పటి వరకూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికార బాధ్యతలు చేపట్టాక ఆయన పార్టీని వదిలేసి పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టేవారు. అభివృద్ధి, సంక్షేమం అంటూ నిత్యం శ్రమిస్తుండే వారు. అధికారులకు టార్గెట్లు పెట్టి వేధిస్తుండే వారు. కొన్ని సార్లు ఆయన అధికారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు. మరోవైపు పార్టీ కోసం సమయం కేటాయించట్లేదనే ఆరోపణలుండేవి. పార్టీని నిజంగానే పట్టించుకోకపోవడంతో వరుసగా రెండోసారి అధికారంలోకి రాకపోయే వారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

చంద్రబాబు ముందులాగా కాకుండా ఇప్పుడు టైమ్ సెన్స్ బాగా పాటిస్తున్నారు. గతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సెక్రటేరియేట్ లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటున్నారు. సమావేశాలను కూడా సింపుల్ గా ముగించేస్తున్నారు. గంటలు గంటలు సమీక్షలు ఉండట్లేదు. సబ్జెక్ట్ కే మీటింగులు పరిమితమవుతున్నాయి. గతంలో కేబినెట్ మీటింగులు రోజంతా జరిగేవి. కానీ ఈసారి కేవలం మూడు గంటల్లోనే ముగించేసేవారు. గతంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రెస్ మీట్ తో ముందుకొచ్చేవారు. కానీ ఇప్పుడు అవసరమైతే తప్ప బాబు బయటకు రావట్లేదు. అదే సమయంలో రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులపై కఠినంగా ఉంటున్నారు. సమర్థులైన అధికారులకు పెద్దపీట వేస్తున్నారు.

మరోవైపు పార్టీకోసం కూడా చంద్రబాబు సమయం కేటాయిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు ఎవరు వచ్చినా వాళ్లకు సమయం కేటాయిస్తున్నారు. వాళ్లు చెప్పినవి వింటున్నారు. మరోవైపు ప్రతి శనివారం పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ కేడర్ కోసం సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. గతంలో చంద్రబాబు వరకూ వెళ్లాలంటే సెక్యూరిటీని దాటుకుని వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తనకోసం ఎవరైనా ఎదురుచూస్తున్నారని తెలిస్తే కాన్వాయ్ ఆపి మరీ చంద్రబాబు వాళ్లను కలుస్తున్నారు. దీంతో ప్రతిసారి తాను మారిపోయానని చంద్రబాబు చెప్తున్న ప్రతిసారీ అది అయ్యేపని కాదులే అని అందరూ నిట్టూర్చే వారు. కానీ ఇప్పుడు మాత్రం కేడర్ అంతా మీరు నిజంగానే మారిపోయారు సర్ అని సంబరపడుతున్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :