ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu : సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు తీరు..!!

Chandrababu : సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు తీరు..!!

రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు సౌమ్యంగా ఎవరినీ నొప్పించకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. వివాదాల జోలికి పోరు. మరికొందరు కలిసున్నంత వరకూ ఒకలా... ఏదైనా తేడా వస్తే మరోలా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరు అవసరార్థం స్నేహం చేస్తుంటారు.. తమది పైచేయి అనుకున్నప్పుడు జులం విదిలిస్తుంటారు. తమకు అంత సీన్ లేదనుకున్నప్పుడు అణిగిమణిగి ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ కోవలోకే వస్తారు. అయితే ఇటీవలికాలంలో చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు (politician). దాదాపు 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో (politics) ఉన్నారు. ఎన్నో గెలుపోటములు చూశారు. దేశ రాజకీయాల్లో (National Politics) కీలక పాత్ర పోషించారు. ఓడిన ప్రతిసారీ మళ్లీ ఉవ్వెత్తున లేవడం చంద్రబాబు నైజం. 2014లో బీజేపీతో (BJP) కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చివర్లో ఆ పార్టీని విభేదించి బయటకు వచ్చారు. దీంతో 2019లో దారుణ పరాభవాన్ని చవిచూశారు. ఐదేళ్లపాటు దాని ఫలితాలను అనుభవించారు. బీజేపీని వదిలి తప్పు చేశామని చంద్రబాబుకు అప్పుడే అర్థమైంది. అందుకే 2024 ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీకి దగ్గరై పోటీ చేశారు.

ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన (Janasena) కూటమి సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే బీజేపీ కూడా చంద్రబాబుపై ఆధారపడేంత.! అయినా చంద్రబాబు మాత్రం బీజేపీని పెద్దన్నలాగే భావిస్తున్నారు. కేంద్రంలో మోదీ (Modi) ప్రభుత్వం తన మద్దతు వల్లే మనుగడ సాగిస్తోందని చంద్రబాబుకు తెలుసు. అయినా చంద్రబాబు మాత్రం ఎక్కడా బీజేపీ మెడలు వంచి తన పంతాలు నెగ్గించుకునేందుకు ప్రయత్నించట్లేదు. బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా మోదీని, అమిత్ షాను పొగుడుతున్నారు. బీజేపీతో భవిష్యత్తులో తమ పొత్తు కొనసాగుతుందని సంకేతాలిస్తున్నారు.

వాస్తవానికి ఇది చంద్రబాబు వైఖరికి పూర్తి విరుద్ధం. తనకు పూర్తి పవర్ ఉన్నప్పుడు చంద్రబాబు చక్రం తిప్పాలనుకుంటారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు అలా చేయట్లేదు. ఎందుకంటే బీజేపీ సత్తా ఏంటో చంద్రబాబుకు బాగా తెలిసొచ్చింది. బీజేపీని విభేదిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో 2019 ఎన్నికలు చూపించాయి. అందుకే కష్టమో నష్టమో బీజేపీతోనే తన ప్రయాణం అనే క్లారిటీకి చంద్రబాబు వచ్చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాలైనా, పార్టీ ప్రయోజనాలైనా, రాష్ట్ర ప్రయోజనాలైనా బీజేపీ మద్దతుగా ఉంటే నెరవేరే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు కాస్త వెనక్కు తగ్గితే నష్టమేం లేదనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబును చూసిన వాళ్లంతా ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన అసలు సిసలైన రాజకీయ నాయకుడని పొగుడుతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :