ASBL Koncept Ambience
facebook whatsapp X

Jagan U Turn: ఓటమి నుంచి జగన్ పాఠాలు నేర్చుకుంటున్నారా..!?

Jagan U Turn: ఓటమి నుంచి జగన్ పాఠాలు నేర్చుకుంటున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఒక సంచలనం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ లాంటి మహా సముద్రాన్ని ఎదుర్కొని పార్టీ పెట్టి నిలబడగలిగారు వైఎస్ జగన్ (YS Jagan). పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చిన వారిలో జగన్ ఒకరు. అయితే అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు కొన్ని అనుకోని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ విజయం తర్వాత ఘోర ఓటమిని చవి చూసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే వాటిని ఇప్పుడిప్పుడే మళ్లీ సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు జగన్.

2019లో 151 సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఘన విజయం సాధించింది. టీడీపీకి (TDP) 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీకి తిరుగులేదనుకున్నారు. అయితే ఐదేళ్లు తిరిగే సరికి వైసీపీ (YCP) హవా పూర్తిగా తగ్గిపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నగదు బదిలీ లాంటి ప్రోగ్రామ్స్ ఘనంగా అమలు చేసినా వైసీపీ ఎందుకు ఓడిపోయిందని ఆరా తీశారు. అయితే నియోజకవర్గాల్లో నేతల మార్పు బాగా ప్రభావం చూపించినట్లు తేలింది.

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 82 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వీళ్లలో కొంతమందికి సీట్లు నిరాకరించగా.. మరికొంతమందిని ఇతర నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపింది. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) ను నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేయించింది. అవనిగడ్డ నుంచి గెలిచిన జోగి రమేశ్ (Jogi Ramesh) ను పెనమలూరు పంపించింది.. అంతేకాదు.. పది పదిహేను సీట్లలో సామాన్యులకు సీట్లు ఇచ్చామని చెప్పుకునేందుకు కూలీలు, డ్రైవర్లను కూడా బరిలోకి దింపింది. మైలవరం (Mylavaram) లాంటి కీలక నియోజకవర్గాల్లో జడ్పీటీసీని పోటీ చేయించింది. అయితే ఇలాంటి వాళ్లంతా ఓడిపోయారు.

ఈ ఓటమి నుంచి జగన్ పాఠాలు నేర్చుకున్నారో ఏమో.. తాజా మార్పులు, చేర్పుల్లో మళ్లీ పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. నేతలకు వారివారి సొంత నియోజకవర్గాలనే అప్పగిస్తున్నారు. జోగి రమేశ్ కు తన సొంతూరు మైలవరం బాధ్యతలు అప్పగించారు. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు (Malladi Vishnu) గత ఎన్నికల్లో సీటివ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన్ను మళ్లీ సెంట్రల్ ఇన్ ఛార్జ్ గా నియమించింది. 2019లో విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాస్ (Vellampally Srinivas) ను తాజా ఎన్నికల్లో సెంట్రల్ నుంచి బరిలోకి దింపారు జగన్. అక్కడాయన ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ వెస్ట్ బాధ్యతలు ఇచ్చారు. దీంతో జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :