ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇరికించారా...??

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇరికించారా...??

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు హాట్ టాపిక్ గా మారాయి. కొంతకాలంగా నేతల తెరచాటు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పలువురు నేతల పరువు పోతోంది. తాజాగా టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళానేతతో రాసలీలలు సాగిస్తూ వీడియోకు చిక్కారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. బాధితురాలు దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు. అయితే కోనేటి ఆదిమూలంను కొందరు కావాలనే ఇరికించినట్లు టాక్ నడుస్తోంది.

కోనేటి ఆదిమూలం ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉండేవారు. 2019లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో ఆయన టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి ఈ టికెట్ ను ఆశించిన వారిలో ప్రస్తుత బాధితురాలు వరలక్ష్మి కూడా ఉన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కోనేటి ఆదిమూలం గెలుపునకు తాను కృషి చేసినట్లు ఆమె చెప్తున్నారు. ఏదైతేనేం కోనేటి ఆదిమూలం గెలిచారు. అయితే కోనేటి ఆదిమూలాన్ని పార్టీలోకి తీసుకోవడాన్ని పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లంతా ఆయనపై పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు.

కోనేటి ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విభేదాలుండేవి. తనకు టికెట్ రాకపోవడానికి పెద్దిరెడ్డే కారణమని ఆయన బహిరంగంగానే ఆరోపించారు. మరోవైపు టీడీపీలో చేరిన తర్వాత కూడా ఆయనకు వ్యతిరేకంగా పులువురు టీడీపీ నేతలు పనిచేస్తూ వస్తున్నారు. ఆదిమూలం తమను కలుపుకుపోవట్లేదని నేతలు చెప్తుంటే.. తాను ఎంత ట్రై చేస్తున్నా తనకు సహకరించట్లేదని ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేతల వైఖరిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరిస్తూ వచ్చారు. దీంతో ఆదిమూలంను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న కొంతమంది టీడీపీ నేతలు ఆయనపై స్కెచ్ వేసినట్లు సమాచారం.

మహిళా నేత వరలక్ష్మిని పావుగా వాడుకుని ఆదిమూలంను ఇరికించారనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో కలిసి కొంతమంది టీడీపీ నేతలు ఈ కుట్ర చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణకు బాధితురాలు వరలక్ష్మి సహకరించట్లేదు. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరిస్తున్నారు. దీంతో ఇది కుట్రనేనని ఆదిమూలం వర్గీయులు చెప్తున్నారు. వాళ్లు ట్రాప్ చేశారు సరే.. ఈ వయసులో ఆదిమూలం ఎందుకు ఇలాంటి పనులు చేశారనేదే ఇప్పడు ప్రశ్న. ఎలాగైతేనేం వీడియోలకు చిక్కారు కాబట్టి పార్టీ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :