ASBL NSL Infratech

రాజకీయ చదరంగంలో బలిపశువులు అధికారులే..!

రాజకీయ చదరంగంలో బలిపశువులు అధికారులే..!

రాజకీయ చదరంగంలో అధికారులు బలిపశువులుగా మారుతున్నారు. గతంలో అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య ఒక గీత ఉండేది. ఎవరి పనులు వాళ్లు చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పాలకుల మెప్పుకోసం పాకులాడుతున్న కొంతమంది అధికారులు.. వాళ్లు చెప్పిన ప్రతిదానికీ తలూపి తర్వాత చేతులు కాల్చుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతోంది..

ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారుల బదిలీలు నిత్యకత్యమైపోయాయి. అధికారులు నియమ నిబంధనలకు లోబడి తమ పని తాము చేసుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ చాలా మంది అధికారులు అలా పనిచేయట్లేదు. ఉన్నత హోదా కోసమో లేకుంటే తమకు అనుకూలమైన పోస్టింగ్ కోసమో పాలకులకు తొత్తుగా మారుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి పాలకులు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఒక పార్టీకి లేదా కొంతమంది నేతలకు అనుకూలురుగా ముద్రవేయించుకుంటున్నారు కొంతమంది అధికారులు.

గత ఐదేళ్లూ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ పార్టీకి, నేతలకు అనుకూలంగా పనిచేశారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి పాలకులు ఎలా చెప్తే అలా చేశారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అలాంటి అధికారులంతా మళ్లీ పాలకుల ప్రాపకం కోసం పాకులాడడం మొదలు పెట్టారు. అయితే ఈసారి సీఎం చంద్రబాబు అలాంటి అధికారుల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. నాడు వైసీపీకోసం పనిచేసిన అధికారులందరినీ పక్కన పెడుతున్నారు. మెయిన్ లైన్లో కాకుండా లూప్ లైన్ లోకి తోసేస్తున్నారు. దీంతో అధికారులంతా వణికిపోతున్నారు.

ప్రభుత్వం మారగానే కొంతమంది అధికారులు వాలంటరీ రిటైర్మెంట్లు కూడా కోరుతున్నారు. మరికొందరు డిప్యుటేషన్ పై ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఇతర ప్రదేశాల నుంచి డిప్యుటేషన్లపై వచ్చిన వాళ్లు వెంటనే రిలీవ్ చేయాలని కోరుతున్నారు. వాళ్లు తప్పులు చేశారు కాబట్టే భయంతో ఇలా వణికిపోతున్నారు. తమను ఎక్కడ ఇరికిస్తారేమోనని భయపడుతున్నారు. చట్టం ప్రకారం పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. గతంలో పాలకులు చెప్పారని నిబంధనలుక విరుద్ధంగా పనిచేసిన కొందరు అధికారులు జైళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కొంతమంది అధికారుల్లో మార్పు రావట్లేదు. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. అందుకే బదిలీలకు బలి అవుతున్నారు. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :