ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీలో చట్టం తన పని తాను చేసుకుపోతోందా..?

ఏపీలో చట్టం తన పని తాను చేసుకుపోతోందా..?

 

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరి నెల కావస్తోంది. ఈ నెల రోజుల్లో అనేక పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. అయితే ఎన్నికలకు ముందు టీడీపీ చూపించిన స్పీడ్.. అధికారంలోకి వచ్చాక మాత్రం చూపించలేకపోతోందనే టాక్ నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే వైసీపీ అక్రమాలను వెలికి తీస్తామని.. బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు హెచ్చరిస్తూ వచ్చారు. లోకేశ్ అయితే రెడ్ బుక్ చూపించి మరీ నేతలకు, అధికారులకు వార్నింగులు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి నెలరోజులవుతున్నా ఇంకా అలాంటి దూకుడు కనిపించట్లేదని టీడీపీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.

అయితే ఏపీలో చట్టం తని పని తాను చేసుకుపోతున్నట్టు అర్థమవుతోంది. పైకి ఏమాత్రం హడావుడి లేకుండా లోలోపల అన్నీ సెట్ అయిపోతున్నాయని తెలుస్తోంది. చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఆయన ఎన్నికల్లో గెలిచిన జూన్ 4 నుంచే యాక్షన్ లోకి దిగారని చెప్పొచ్చు. ఆరోజే ఆయన అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటి నుంచే అధికారయంత్రాంగం పనిలోకి దిగిపోయింది. ఇక చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పని మరింత ఊపందుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బరితెగించి ప్రవర్తించిన వారందరిపైనా కేసులు నమోదవుతున్నాయి.

టీడీపీ అధికారంలోకి వస్తే కొందరు వైసీపీ నేతలను వెంటనే తీసుకెళ్లి అరెస్టు చేస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే ఇప్పటి వరకూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మినహా మిగిలిన నేతలెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. అది కూడా ఎన్నికల సంఘం కేసు కాబట్టి కోర్టు తీర్పు మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మిగిలిన నేతల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం తొందరపడట్లేదు. కానీ లోపల మాత్రం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్, దేవినేని అవినాశ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా.. లాంటి వారిపై కేసుల ప్రక్రియ మొదలైంది. వీళ్లలో కొంతమందిపై ఇప్పటికే కేసులు నమోదు కాగా.. మరికొందరిపై ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయనున్నారు.

జగన్ హయాంలో కొందరు టీడీపీ నేతలపై ఆధారాలు సేకరించకుండానే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చంద్రబాబు అలా చేయాలనుకోవట్లేదు. పక్కా ఆధారాలు లబించిన తర్వాతే కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఆధారాల సేకరణలో పోలీసులు బిజీగా ఉన్నారు. వాటిని పూర్తిగా సేకరించిన తర్వాతే కేసులు నమోదు చేసి అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా గత ప్రభుత్వం చేసినట్లు ఫస్టు నేతలను అరెస్టు చేసేస్తే అవి కక్షపూరిత అరెస్టులను అర్థమైపోతుంది. అందుకే అలాంటి అవకాశం ఇవ్వకుండా పక్కాగా చట్ట ప్రకారం పనిచేసుకుపోతున్నారు చంద్రబాబు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :