ASBL Koncept Ambience
facebook whatsapp X

Revanth Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా..!?

Revanth Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా..!?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). అయినా ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకుంటున్న సమయంలో ఆ పార్టీని ఒడ్డుకు చేర్చారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). పీసీసీ చీఫ్ (PCC Chief) గా ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో ఎంతోమంది సీనియర్లున్నా వాళ్లను కాదని రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై (Chief Minister Revanth Reddy) కూర్చోబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command). రేవంత్ రెడ్డి కూడా ఆరంభంలో దూకుడుగానే ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా దూకుడు మీదున్నా అవి వర్కవుట్ కావట్లేదనే టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఎక్కడో తప్పు చేస్తున్నారనే భావన కలుగుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 10 నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టో (Manifesto) అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రుణమాఫీ (Runamafee), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free bus), మెగా డీఎస్సీ (Mega DSC), ఉచిత గ్యాస్ సిలిండర్లు (Free Gas cylinders).. లాంటి వాటిని అమలు చేశారు. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే విమర్శలున్నాయి. అది వేరే సంగతి. అయితే చెప్పింది చేస్తాం అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధి పైన కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (Greater Hyderabad) కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు.

అయినా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది రేవంత్ రెడ్డి పట్టుదల. ఇప్పుడున్న నగరం సరిపోవట్లేదని.. అందుకే ఫోర్త్ సిటీని (Forth City) అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో అత్యాధునిక వసతులు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Samshabad Airport) సమీపంలో దీన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకోసం మెట్రోకు (Metro rail) కూడా అనుమతించారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో ఆక్రమణనలకు గురైన వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా (HYDRA) ఏర్పాటు చేసి నిర్మొహమాటంగా అక్రమ కట్టడాలను (illegan constructions) కూల్చేస్తున్నారు.

ఇక్కడే రేవంత్ రెడ్డి అంచనాలు తప్పవుతున్నాయి. అక్రమ కట్టడాలు కూల్చడం వరకూ బాగానే ఉంది. కానీ వాటిని కాయకష్టం చేసి అప్పోసొప్పో చేసి ఇళ్లు కొనుక్కుంటే వాటిని కూల్చడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. బడాబాబులు తట్టుకోగలగుతారు కానీ సామాన్య కూలీలు, ఉద్యోగుల ఇళ్లను కూల్చేస్తే వాళ్లు ఎక్కడికి పోవాలని.. అప్పులు ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. నాడు ఈ భవనాలకు అనుమతిలిచ్చిన అధికారులు, ఉద్యోగులను వదిలేసి యజమానులపై కక్షసాధించడమేంటని పలువురు నిలదీస్తున్నారు. ఈ విషయంలో అన్ని వేళ్లూ రేవంత్ రెడ్డి వైపే ఉన్నాయి. ఈ అంశంలో సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నా.. రేవంత్ కు హైకమాండ్ అండదండలు పుష్టిగా ఉండడంతో చెప్పలేకపోతున్నారు. ఇలాగే ముందుకెళ్తో రేవంత్ రెడ్డికి మున్ముందు సమస్యలు తప్పవేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :