ASBL Koncept Ambience
facebook whatsapp X

Vidadala Rajini: విడదల రజనికి జగన్ మొండి చెయ్యి..!!?

Vidadala Rajini: విడదల రజనికి జగన్ మొండి చెయ్యి..!!?

ఆంధ్రప్రదేశ్ లో విడదల రజని గురించి తెలియని వారుండరు. చిన్న వయసులోనే తన తెలివితేటలతో మంత్రి స్థాయికి (Minister)  ఎదిగారామె. తెలుగుదేశం పార్టీలో (TDP) రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విడదల రజని (Vidadala Rajini) తర్వాత వైసీపీ (YSRCP) చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. దీంతో ఆమెకు పార్టీలో మంచి పట్టుందని అందరికీ అర్థమైంది. అయితే చిలకలూరిపేటలో  (Chilakaluripet)  ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన హైకమాండ్.. గుంటూరు వెస్ట్ (Gunter West) నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపింది. అయితే అక్కడ కూడా ఆమె దారుణంగా ఓడిపోయారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు.

ఓడిపోయిన తర్వాత విడదల రజని చుట్టూ అనేక వివాదాలు ముసుకున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆమె వసూళ్లపై అనేక మంది ఫిర్యాదులు చేశారు. కొంతమందికి ఆమె తిరిగి డబ్బు కూడా చెల్లించారు. ఇప్పటికీ ఆమె అక్రమాలపై (illegal activities)  ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇసుక (Sand), కమీషన్లు  (commissions), భూఅక్రమాల్లో విడదల రజని హస్తంపై ఎక్కువగా కంప్లెయింట్స్ (complaints)  వస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నేత టికెట్ ఇప్పించేందుకు విడదల రజని డబ్బు తీసుకున్నట్టు బాంబు పేల్చారు. ఇది పెద్ద దుమారమే రేపింది.

ఓ వైపు ఓటమి.. మరోవైపు అవినీతి ఆరోపణలు విడదల రజనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తనపై వస్తున్న ఫిర్యాదులను తిప్పికొట్టేందుకు విడదల రజని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు హైకమాండ్ కూడా మద్దతుగా ఉండడంతో ఆమెకు ఇప్పటికీ పార్టీలో మంచి పట్టుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడామెకు అంత సీన్ లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. వాస్తవానికి విడదల రజనికి ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్య పోస్టూ లేదు. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి (Ex minister) మాత్రమే. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కనీసం పార్టీపరంగా అయినా తనకు మంచి పోస్టు దక్కుతుందని విడదల రజని భావించారు.

విడదల రజని ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్టుకు పంపించింది అధిష్టానం. అయితే అక్కడ కూడా ఓడిపోవడంతో తనకు జిల్లా అధ్యక్ష పదవి (District president)  దక్కుతుందని విడదల రజని ఆశించారు. అయితే ఆ పోస్టును అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఇచ్చారు జగన్. దీంతో విడదల రజని అలిగారు. కనీసం తనకు గుంటూరు అర్బన్ (Guntur Urban)  జిల్లా పదవి ఇస్తారని ఊహించారు. అయితే దాని కూడా జగన్ ససేమిరా అన్నట్టు సమాచారం. దీంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. విడదల రజని ఓవరాక్షన్ వల్లే జగన్ (YS Jagan) ఆమెను పక్కన పెట్టినట్లు జిల్లా నేతలు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె అన్నీతానై చక్రం తిప్పారు. సీఎంఓలో కూడా తన మాట నెగ్గేలా కొంతమందిని తనవైపు తిప్పుకుని పెత్తనం చెలాయించారు. పార్టీ నేతల నుంచే వసూళ్లు, కమీషన్లు తీసుకున్న విషయం జగన్ వరకూ చేరింది. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అండదండలు విడదల రజనికి పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం కూడా బహిరంగ రహస్యమే. ఇలాంటివారిని ప్రోత్సహిస్తే పార్టికి నష్టం కలుగుతుందని భావంచిన జగన్.. విడదల రజనిని ఇంటికే పరిమితం చేసినట్టు తెలుస్తోంది.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :