ASBL Koncept Ambience
facebook whatsapp X

ఫేక్ ప్రచారంతో పరువు పోగొట్టుకుంటున్న వైసీపీ..!?

ఫేక్ ప్రచారంతో పరువు పోగొట్టుకుంటున్న వైసీపీ..!?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయి పార్టీలు. కొంతమంది నేతలు శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ప్రచారాలతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆరితేరాయి. ఈ విషయంలో వైసీపీ కాస్త ముందుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఐప్యాక్ సేవలందించిన సమయంలో ఇలాంటి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సర్క్యులేట్ అయ్యేవి. దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలిసేది కాదు. ఇలాంటి వాటిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పరిస్థితే తలెత్తింది. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుచరులు తిరుమల పద్మావతి అతిథి గృహంలో ప్రవైటు పార్టీ చేసుకున్నారని.. అక్కడ చిందులేశారని వైసీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇదేంటీ.. మంత్రిగా ఉండి ఇలాంటి పనులు చేస్తారా.. అధికారం ఉంటే ఎంతకైనా తెగిస్తారా అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మంత్రిది ఎంత బరితెగింపు అని మరికొందరు మండి పడుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఆరాధించే పవిత్ర తిరుమలలో ఇలాంటి పనులు చేస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వీడియోను సీరియస్ గా తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. నిజంగా ఇది తిరుమల పద్మావతి అతిథిగృహంలో జరిగిందా అని విచారణ జరిపింది. తీరా తేలిందేంటంటే.. అది అసలు తిరుమలలో జరగలేదు. తిరుమలలో రికార్డు చేసిన వీడియోనే కాదు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. మరోవైపు ఈ వీడియోపై మంత్రి సంధ్యారాణి కూడా స్పందించారు. తాను తిరుమల శ్రీనివాసుణ్ణి ఆరాధిస్తున్నానని.. అలాంటి చోట తప్పుడు పనులు చేసే వంశం కాదని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 29న తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశామని.. అందులో అతని స్నేహితులు పాల్గొని డ్యాన్స్ చేశారని వివరణ ఇచ్చారు. అనంతరం 31న తిరుమలకు కాలినడకన బయలుదేరి 1న దర్శనం చేసుకుని అదే రోజు వరదల కారణంగా విజయవాడ వచ్చేశామని ఆమె వివరించారు. తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఎప్పుడూ పద్మావతి అతిథి గృహంలో బస చేయలేదని చెప్పారు.

వైసీపీ శ్రేణులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్ముకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులు సూచిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలతో లబ్ది పొందే ప్రయత్నం చేసిందని.. అయినా ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ పోతే  ఈసారి ఆ సీట్లు కూడా రావని హెచ్చరిస్తున్నారు. పవిత్ర తిరుమలను కూడా ఫేక్ ప్రచారాలకు వాడుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేశ్ కూడా తిరుమలను కూడా ఇలాంటి ఫేక్ ప్రచారానికి వాడుకుంటావా.. నువ్వు మారవా జగన్ అని ప్రశ్నించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :