ASBL Koncept Ambience
facebook whatsapp X

YCP Game: ఎమ్మెల్సీల రాజీనామాలపై వైసీపీ మాస్టర్ గేమ్..!!?

YCP Game: ఎమ్మెల్సీల రాజీనామాలపై వైసీపీ మాస్టర్ గేమ్..!!?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మధ్య ఎత్తులు, పైఎత్తుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత ఐదేళ్లు వైసీపీ (YCP) ప్రభుత్వం టీడీపీని (TDP) నిర్వీర్యం చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నించింది. అయినా తెలుగుదేశం (Telugudesam) తట్టుకుని నిలబడగలిగింది. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ (YSRCP) కనీసం ప్రతిపక్ష హోదా (Opposition Party) కూడా దక్కించుకోలేకపోయింది. అయితే అవకాశం ఉన్న చోట తన సత్తా చూపించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగమే వైసీపీ ఎమ్మెల్సీల (YCP MLC) రాజీనామాలను (Resignations) ఆమోదించకుండా అడ్డుకోవడం.!

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి (NDA Alliance) జూన్ 12న అధికారం చేపట్టింది. దీంతో వైసీపీకి చెందిన పలువురు నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటూ రాజీనామాలు సమర్పించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి, పదవులకు కూడా గుడ్ బై చెప్తూ లేఖలు సమర్పించారు. ఇప్పటివరకూ రాజ్యసభ ఎంపీలు (Rajyasabha MPs) మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాలు చేశారు. వాళ్ల రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ వెంటనే ఆమోదించారు. త్వరలో ఆ స్థానాలకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.

అదే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పార్టీకి, పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఆ పార్టీకి చెందిన పోతుల సునీత (Pothula Sunitha) ఆగస్టు 28న రాజీనామా చేశారు. అలాగే.. ఆగస్టు 30న బల్లి కల్యాణ చక్రవర్తి (Balli Kalyan Chakravarthy), కర్రి పద్మశ్రీ (Karri Padmasree) రాజీనామా లేఖలను మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు (Council Chairman Moshen Raju) అందించారు. వీళ్లిద్దరూ నేరుగా ఆయన్ను కలిసి రాజీనామా లేఖలను స్వయంగా ఇచ్చారు. అయినా వీళ్ల ముగ్గురి రాజీనామాలను ఆయన ఇంతవరకూ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కర్రి పద్మశ్రీ తాజాగా ఛైర్మన్ మోషేన్ రాజుకు ఓ లేఖ రాశారు. తమ రాజీనామాలను ఇంతవరకూ ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. వెంటనే ఆమోదించాలని కోరారు.

అయితే మండలిలో ఇప్పటికీ వైసీపీదే ఆదిపత్యం. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందిన నేత. రాజ్యసభలో (Rajyasabha) చేయగలిగిందేమీ లేదు. కనీసం ఇక్కడైనా రాజీనామాలను ఆమోదించకుండా ఉంటే వాళ్లను ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు వీలవుతుంది. అలాగే మండలిలో (Legislative Council) తన బలాన్ని కాపాడుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ స్ట్రాటజీతోనే ఈ రాజీనామాలను ఆమోదించకుండా వైసీపీ అడ్డుకట్ట వేస్తున్నట్టు సమాచారం. రాజీనామాలను ఆమోదించాలా లేదా అనేది ఛైర్మన్ విచక్షణ. ఈ విషయంలో కోర్టులు కూడా పెద్దగా జోక్యం చేసుకోవు. అందుకే అధికార కూటమికి ఇలా చెక్ పెట్టాలని వైసీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :