ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ టాప్ లీడర్లందరిపైనా ఆరోపణలు..! బయటపడేదెలా..!?

వైసీపీ టాప్ లీడర్లందరిపైనా ఆరోపణలు..! బయటపడేదెలా..!?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓడిపోయిన తర్వాత చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఒకవైపు పార్టీకి అండగా ఉన్న నేతలెంతోమంది రాజీనామాలు (Resigns) చేశారు. మరికొంతమంది చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు ముగిసి వందరోజులు కాకముందే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. మరోవైపు గత ఐదేళ్లలో అవినీతి (Corruption), అక్రమాలకు (Irregularities) పాల్పడ్డారనే ఆరోపణలతో కీలక నేతలపై కేసులు (Cases) నమోదవుతున్నాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక వైసీపీ (YCP) హైకమాండ్ తలలు పట్టుకుంటోంది. వీళ్లకు అండగా నిలిచి మాట్లాడే నాయకులు కూడా లేకపోవడం విశేషం.

సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) పవరేంటో గత ఐదేళ్ళలో చూశాం. జగన్ (Jagan) దగ్గరకు వెళ్లాలంటే ముందు సజ్జల దర్శనం చేసుకోవాల్సిందే. ఆయన అనుమతిస్తేనే అధినేతను కలిసే అవకాశం దక్కుతుంది. లేకుంటే అటు నుంచి తిరుగుముఖం పట్టాల్సిందే. అన్ని మంత్రిత్వ శాఖలనూ ఆయనే మేనేజ్ చేసేవారని చెప్తుంటారు. అందుకే ఆయన్ను సకలశాఖ మంత్రిగా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు సజ్జల సినీనటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జెత్వానీ ఫ్యామిలీని ఇరికించేందుకు అవసరమైన ప్లాన్ అంతే సజ్జలే నడిపించారనేది ఆరోపణ. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ లు (IPS) సస్పెండ్ అయ్యారు. త్వరలో సజ్జలతో పాటు ఓ ఐఏఎస్ (IAS) పేరు కూడా చేర్చబోతున్నారనే టాక్ నడుస్తోంది.

ఇక తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదం టీటీడీ మాజీ ఛైర్మన్ (TTD) వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) మెడకు చుట్టుకుంటోంది. ఆయన హయాంలోనే కల్తీ నెయ్యి (adulterated ghee) కాంట్రాక్ట్ కుదిరిందని.. ఆ సంస్థ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రభుత్వం, టీటీడీ చెప్తోంది. దేశవ్యాప్తగా ఇది పెద్ద దుమారమే రేపుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై విచారించేందుకు (Enquiry) సిద్ధమవుతోంది ప్రభుత్వం. కల్తీ జరిగిందని NDDB ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఇప్పుడు ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక వైసీపీ ఇబ్బంది పడుతోంది. జగన్ దీన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు.

ఇక వైసీపీలో కీలకంగా ఉన్న మరో నేత విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy). ఈయన జగన్ తర్వాత కొంతకాలం పాటు నెంబర్ టూగా కొనసాగారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఈయన ఉత్తరాంధ్ర (Uttarandhra) బాధ్యతలు చూశారు. ఆ సమయంలో విశాఖలో (Vizag) భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఆయన కుమార్తెకు చెందిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ (GVMC) కూల్చేస్తోంది. హైకోర్టు (High Court) కూడా వాటిని అక్రమ కట్టడాలుగా నిర్ధారించింది. దీంతో విజయసాయి రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇలా పార్టీలో కీలక నేతలందరిపైనా ఇలాంటి అవినీతి, అక్రమ ఆరోపణలు వస్తున్నా నేతలెవరూ నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) లాంటి నేతలు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మిగిలిన నేతలంతా ఏమైపోయారు.. వాళ్లంతా పార్టీకి దూరమయ్యారా.. లేకుంటే ఎందుకొచ్చిన గొడవలే అని కామ్ గా ఉండిపోతున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :