ASBL Koncept Ambience
facebook whatsapp X

యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా... సబలెంక

యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా... సబలెంక

యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అరినా సబలెంకా డబ్ల్యూటీఏ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించింది. అధికారికంగా ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియటెక్‌ను దాటేసి  బెలారస్‌ స్టార్‌ సబలెంక టాపర్‌గా నిలిచింది. ఇక గత 11 నెలలుగా టాప్‌ ర్యాంక్‌లో కొనసాగిన పోలెండ్‌ క్వీన్‌ స్వియటెక్‌ రెండో ర్యాంక్‌కు పడిపోయింది. సబలెంక నెంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి నవంబరు దాకా ఆమె టాప్‌లో నిలిచింది. ఇక, కొకొ గాఫ్‌, జెస్సికా పెగులా, ఎలెనా రిబకినా వరుసగా 3, 4, 5 ర్యాంకులతో టాప్‌`5లో ఉన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :