ASBL Koncept Ambience
facebook whatsapp X

Ashok Gajapathi Raju about Jagan: దసరా హాలిడే గ్యాప్ తీసుకొని తిరిగి తిరుమల టాపిక్ అందుకున్న టీడీపీ నేతలు..

Ashok Gajapathi Raju about Jagan: దసరా హాలిడే గ్యాప్ తీసుకొని తిరిగి తిరుమల టాపిక్ అందుకున్న టీడీపీ నేతలు..

దేశవ్యాప్తంగా దసరా (Dasara) అద్భుతంగా జరిగింది.. పండగ సెలవులు పూర్తయ్యాయి.. ఇక అందరూ స్కూల్ కి ఆఫీసులకి బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ సెలవల సందర్భంగా కాస్త గ్యాప్ తీసుకున్న టీడీపీ నేతలు తిరిగి తిరుమల టాపిక్ ను వైరల్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) కూడా వైసీపీ (YCP) అధినేత జగన్ (Jagan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ(YCP ) హయాంలో కేవలం తిరుమల లడ్డు (Tirumala Laddu) పవిత్రత మాత్రమే దెబ్బ తినలేదని.. అన్ని ఆలయాలు అపవిత్రమయ్యాయి అంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ పవిత్రత అన్న మాట లేకుండా పోయిందని.. ప్రసాదాల దగ్గర నుంచి అన్నసంతర్పణల వరకు అన్నిటిలో లోటుపాట్లు ఉన్నాయని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సైలెంట్ అవుతున్న తిరుమల కాన్సెప్ట్ ని మరొకసారి వైరల్ చేస్తున్నాయి. 

ఇక గతంలో విజయవాడ దుర్గమ్మ (Vijayawada Durgama) ఆలయానికి చెందిన రధం గుర్రాల బొమ్మలను అపహరించిన విషయాన్ని తిరిగి గుర్తుచేసిన అశోక్ గజపతిరాజు.. అప్పుడు వైసీపీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని పేర్కొన్నారు. అంతేకాదు రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం శిర‌చ్ఛేదం జరిగినప్పుడు వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు అని వ్యాఖ్యానించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంతేకాదు తిరుమలలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించి.. కేకులు కట్ చేశారని.. పాశ్చాత్తా పద్ధతిని అనుసరిస్తూ పుట్టినరోజు వేడుకలు జరిపించారు అని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఒక తిరుమలే కాదు.. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎన్నో ప్రధాన ఆలయాలు భ్ర‌ష్టు పట్టాయి అంటూ సంచలన విమర్శలు చేశారు. జగన్ అలా ప్రవర్తించాడు కాబట్టే దేవుడు ఆయన్ని 11 స్థానాలకు పరిమితం చేసి పంగనామాలు పెట్టారు అని వ్యాఖ్యానించారు. 

సోమవారం నాడు విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించే సినిమాలు ఉత్సవాన్ని ప్రారంభించిన అశోక్ గజపతిరాజు ఆలయాల గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు వీటిని సమర్థిస్తుంటే మరికొందరు పరిస్థితులు సొద్దు మనుగుతున్నాయి అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీలు అవసరమా అని అంటున్నారు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమంటూ ఎంత హడావిడి చేశారో అందరికీ తెలుసు.. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేశాక కాస్త శాంతించి సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు అశోక్ గజపతిరాజు చెప్పిన ఈ మాటలు ఎటువంటి కాంట్రవర్సీలకు దారితీస్తాయో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :