ఆటా ఫుడ్ డ్రైవ్ విజయవంతం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) పేద పిల్లలకోసం ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. వాలంటీర్లు, స్కూల్ విద్యార్ధులు తమలోని సేవా భావాన్ని చాటుతూ ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. తమ ఇరుగు, పొరుగువారితో పాటు స్నేహితుల ఇళ్ల నుంచి ఫుడ్ ఐటమ్స్ సేకరించారు. ఇలా సేకరించిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించారు. 150 కుటుంబాలకు 2 నెలల పాటు సేవలందించే ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
న్యూజెర్సీ ఆటా సభ్యులు సంతోష్ రెడ్డి కోరం, ప్రదీప్ కట్ట, హరీష్ బతిని, ఆటాబోర్డు ట్రస్టీలు పరశురాం పిన్నపురెడ్డి, వినోద్ కోడూరు, శ్రీనివాస్ దార్గుల, శరత్ వేముల, రఘువీరారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, మహేందర్ ముసుకు, రమేష్ మాగంటి, విజయ్ కుందూరు, మహి సనపరెడ్డి, విలాస్ జంబుల, ప్రవీన్ రెడ్డి అలా, ధనరాజ్ సేరి, కృష్ణ మోహన్ మూలే, నర్సింహ, వినోద్ కోడూరు, ఫైనాన్స్ కో-చైర్ శ్రీకాంత్ తుమ్మల, రీజినల్ కోఆర్డినేటర్లు సంతోష్ కోరం, ప్రదీప్ కట్ట, మీనాక్షి, ప్రాంతీయ సలహాదారు మహీధర్ సంకపునేనిలు అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా ఆటా-న్యూజెర్సీ సభ్యులను అభినందించారు.