ASBL NSL Infratech

అట్లీ నెక్ట్స్ మ‌ల్టీస్టార‌ర్ మూవీనా?

అట్లీ నెక్ట్స్ మ‌ల్టీస్టార‌ర్ మూవీనా?

సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో స‌త్తా చాటుతుండ‌టం వ‌ల్ల సౌత్ ద‌ర్శ‌కుల‌కు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. నార్త ఇండియన్ ఆడియ‌న్స్ మాస్ ఎలిమెంట్స్ తో ఉండే ఎలివేష‌న్ సినిమాల‌ను చూడ్డానికే ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలు సైతం సౌత్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం త‌మిళ డైరెక‌ట్ర్ విష్ణువ‌ర్ధ‌న్ తో ఓ సినిమా చేస్తున‌న స‌ల్మాన్, మురుగ‌దాస్ తో కూడా ఓ సినిమాను లైన్ లో పెట్టాడు. షారుఖ్ గ‌తేడాది అట్లీతో జ‌వాన్ తీసి మంచి హిట్ అందుకున్నాడు. జ‌వాన్ త‌ర్వాత అట్లీకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా అట్లీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అట్లీ త‌న త‌ర్వాతి సినిమాను స‌ల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

అట్లీ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో స‌ల్మాన్ వెంట‌నే ఓకే అన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను అట్లీ మల్టీ స్టార‌ర్ గా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. దీని కోసం అట్లీ కోలీవుడ్ నుంచి క‌మ‌ల్ ను లైన్ లో పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌మ‌ల్ కు కూడా అట్లీ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సుముఖంగానే ఉన్నాడు. ఫైన‌ల్ నెరేష‌న్ తో అట్లీ మెప్పిస్తే సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఇయ‌ర్ లోనే సినిమా అనౌన్స్‌మెంట్ ఉండొచ్చు. క‌మ‌ల్, స‌ల్మాన్, అట్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే విన‌డానికే ఎంతో బాగుంది. ఇది వ‌ర్క‌వుట్ అయితే బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ అవ‌డం ఖాయం.  

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :