బచ్చలమల్లి టీజర్ టాక్
ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేసిన అల్లరి నరేష్(allari naresh) ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడ్డాడు. కాస్త గ్యాప్ తర్వాత సపోర్టింగ్ రోల్ చేసిన మహర్షి(maharshi) సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన నరేష్ తర్వాత సీరియస్ ఇష్యూ మీద చేసిన నాంది(Nandhi) సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా సాధించింది.
అయితే అల్లరి నరేష్ ఇప్పటివరకు మాస్ టచ్ ఉన్న పాత్రలను చేసింది లేదు. ఇప్పుడు తన ఫ్యాన్స్ కు ఆ లోటు తీర్చడానికి బచ్చలమల్లి(Bachhala malli)గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జులాయిగా పెరిగిన మల్లి అనే కుర్రాడు వ్యసనాలకు అలవాటు పడతాడు. ఎన్ని చెడు అలవాట్లున్నా నిజాయితీగా ఉండే మల్లి తాను ఇష్టపడిన అమ్మాయితో కూడా అలానే ఉంటాడు. అదే అసు సమస్యగా మారుతుంది.
కల్లాకపటం తెలియని ఈ మల్లికి ఊరంతా శత్రువులే అవుతారు. అసలు ఎందుకలా జరిగింది? తన ఇంట్లోనే మల్లి కానివాడిగా ఎందుకు మారాడనేది తెరపైనే చూడాలి. కథ పరంగా కొత్తగా అనిపించకపోయినా అల్లరోడిని ఇలా చూడటం మాత్రం కచ్ఛితంగా కొత్తగానే అనిపిస్తుంది. అమృతా అయ్యర్(Amrutha Iyer) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 20న విపరీతమైన పోటీ మధ్య రిలీజ్ కానుంది. బచ్చలమల్లి కచ్ఛితంగా తనకు కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్న నరేష్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.