ASBL Koncept Ambience
facebook whatsapp X

నెవ‌ర్ బిఫోర్ అనేలా మోక్షు లాంచింగ్

నెవ‌ర్ బిఫోర్ అనేలా మోక్షు లాంచింగ్

ఎంతోకాలంగా నంద‌మూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఫ‌లించి నందమూరి మోక్ష‌జ్ఞ మొద‌టి సినిమా అరంగేట్ర సినిమా ఫిక్స్ అయింది. రీసెంట్ గా మోక్ష‌జ్ఞ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ తో సినిమాను అనౌన్స్ చేశారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో విజువ‌ల్ వండ‌ర్ గా ఈ సినిమా రూపొంద‌నుంది.

బాల‌య్య చిన్న కూతురు తేజ‌స్విని ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. బాల‌య్య కెరీర్లోనే పెద్ద హిట్ అయిన లెజెండ్ పేరుతో బ్యాన‌ర్ ను మొద‌లుపెట్టి మోక్ష‌జ్ఞ‌తో సినిమాను నిర్మిస్తోంది తేజ‌స్విని. మోక్ష‌జ్ఞ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినిమాను జ‌స్ట్ అనౌన్స్ చేశారు త‌ప్పించి అస‌లు క‌థ వేరే ఉంద‌ట‌. దీని కోసం బాల‌య్య స్పెష‌ల్ గా ముహూర్తం పెట్టించి మోక్ష‌జ్ఞ మొద‌టి సినిమా ముహుర్త వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని చూస్తున్నాడ‌ట‌.

ఇండ‌స్ట్రీ పెద్ద‌ల నుంచి ఫ్యాన్స్ వ‌ర‌కు అంద‌ర్నీ పిలిచి ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ ను నెవ‌ర్ బిఫోర్ అనే రీతిలో చేయాల‌ని బాల‌య్య స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. అక్టోబ‌ర్ లో మంచి ముహూర్తం చూసి ఈ వేడుక చేస్తార‌ని, లాంచ్ అయిన వెంట‌నే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంద‌ని, వ‌చ్చే ఏడాది సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తార‌ని బాల‌య్య స‌న్నిహితులంటున్నారు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :