ASBL Koncept Ambience
facebook whatsapp X

మంత్రి శ్రీధర్‌బాబుతో బన్యన్‌ నేషన్‌ ప్రతినిధుల భేటీ... రూ.200 కోట్లతో

మంత్రి శ్రీధర్‌బాబుతో బన్యన్‌ నేషన్‌ ప్రతినిధుల భేటీ... రూ.200 కోట్లతో

ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ పరిశ్రమతో సర్క్యులర్‌ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ బన్యన్‌ నేసన్‌ తెలంగాణలో రూ.200 కోట్ట పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చింది. సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ  ప్రస్తుతం పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో బన్యన్‌ నేషన్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమను నిర్వహిస్తోంది. దీనిని 45 వేల టన్నులకు విస్తరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి. రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ను ఈ సంస్థ యూనిలివర్‌, టాటా మోటార్స్‌ లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తోంది. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్‌తో లాభాల్లో నడుస్తోంది. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కొంత భూమి అడుగుతున్నారు. దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుంది అని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ  సీఈవో మధుసూదన్‌, బన్యన్‌ నేషన్‌ సీఈవో మణి వాజ్‌పేయీ, సీవోవో రాజ్‌ కిరణ్‌ మదనగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :