ఘనంగా బాటా దీపావళి వేడుకలు
బే ఏరియా తెలుగు సంఘం (బాటా) వైభవంగా నిర్వహించే దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్ (ప్రసిద్ధ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు) లైవ్ కచేరీతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్‌గా సంజయ్ టాక్స్ ప్రో, పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, డెంటల్ పార్ట్నర్: యూస్మైల్ డెంటల్, గోల్డ్ స్పాన్సర్: శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్లుగా పిఎన్‌జి జ్యువెలర్స్, ఇన్స్టా సర్వీస్, మహాకాల్ టెంపుల్ వ్యవహరించింది. ఈ వేడుకలకు పాఠశాల తెలుగు స్కూల్, విరిజల్లు రేడియో సహకారాన్ని అందించగా, ఫుడ్ స్పాన్సర్ గా బిర్యానీ బిస్ట్రో వ్యవహరించింది.
ఈ దీపావళి వేడుకల్లో పలు కార్యక్రమాలు హైలైట్స్ గా నిలిచాయి. ఈ వేడులకల కోసం బాటా సాంస్కృతిక బృందం ప్రీమాంట్, సాన్ రామోన్, డబ్లిన్, మిల్పిటాస్, కుపెర్టినో, సాన్ జోస్ వంటి ప్రాంతాలలో శిక్షణ తరగతులు నిర్వహించింది. 100 మందికి పైగా పిల్లలు మరియు యువత వివిధ నృత్యాలలో పాల్గొన్నారు.
రాధామాధవీయం రూపకం, సింధు సురేంద్ర డ్యాన్స్ స్కూల్ వారు ప్రదర్శించిన ఆనందభైరవి క్లాసికల్ బాలే ప్రదర్శన, బే ఏరియా పిల్లలు, యువత, యువకులు చేసిన డ్యాన్స్ ధమాకా, ఆటలు పాటలు గేమ్ షో మహాలక్ష్మీ, బాటా బీట్స్ డ్యాన్స్ స్టూడియో ఎలక్ట్రిఫైయింగ్ మూవ్స్, అప్సర పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఇలా పలు కార్యక్రమాలు వచ్చినవారిని ఎంతగానో అలరించాయి.
దీపావళి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ దుకాణాల స్టాల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్ లైవ్ కచేరీలో సూపర్ హిట్ పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు. ప్రేక్షకులు ఆయన పాటలకు తన్మయత్వంతో డ్యాన్స్ చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కొండల్ కోమారగిరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన బాటా వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శివ కడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిని పరిచయం చేశారు.
స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువేదుల, కమేష్ మల్ల, సిరిష బట్టుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి
కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వేలిగేటి, తారక దీప్తి
లాజిస్టిక్స్ టీం సభ్యులు సందీప్ కేదరిసెట్టి, సురేష్ సివపురం, రవి పోచిరాజు, యూత్ కమిటీ సభ్యులు సంకేత్, ఉదయ్, అది, గౌతమి
బాటా అడ్వైజరీ బోర్డ్ సభ్యులు జయరామ్ కొమటి, విజయ ఆసురి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ వేలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చికోటిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు.