ASBL Koncept Ambience
facebook whatsapp X

బాటా సంక్రాంతి...వేడుకల సందడి...

బాటా సంక్రాంతి...వేడుకల సందడి...

బే ఏరియాలోని తెలుగువారు సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పలు కార్యక్రమాలతోపాటు వంటలు, ముగ్గుల (రంగవల్లి ముగ్గుల పోటీలు), ఎఐఎ ఐడల్, పాటల పోటీలను నిర్వహించారు. వేడుకలు జరిగిన ప్రాంతాన్ని సంక్రాంతి సంప్రదాయాలు కనిపించేలా అలంకరించడంతోపాటు ప్రధాన వేదికపై మల్టీకలర్ బ్యాక్డ్రాప్ లు రంగురంగుల గాలిపటాలను అమర్చారు. ప్రేక్షకులు, పాల్గొన్న కళాకారులు, బాటా వాలంటీర్లు సంప్రదాయ దుస్తులతో కూడిన అలంకరణలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. సంగీత కచేరీ, క్లాసికల్ డ్యాన్స్ బ్యాలెట్, జానపద నృత్యాలు, గేమ్ షో, ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్ లు కూడా అందరినీ అలరించాయి. వచ్చిన అతిధుల కోసం ప్రత్యేక సంక్రాంతి విందు భోజనం వడ్డించారు. 30 రకాల వంటకాలతో ఉన్న ఈ విందు భోజనం నోరూరించేలా కనిపించింది. మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమై రాత్రి 10:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు.

పాటల పల్లకితో కార్యక్రమాలను ప్రారంభించారు. బాటా కరోకే బృందంలోని ప్రతిభావంతులైన గాయకుల ప్రత్యక్ష సంగీత కచేరీ, టాలీవుడ్ గాయకులు ఐశ్వర్య మధురమైన సూపర్ హిట్ పాటలను పాడి అలరించారు.

‘‘పాఠశాల’’ (తానా, బాటా ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు బోధించడానికి ఏర్పాటు చేసిన సంస్థ) విద్యార్థులు నాటకాలతో చేసిన ప్రదర్శనలు ఇతర కార్యక్రమాలు, ముఖ్యంగా పిల్లలు తెలుగు భాషను నేర్చుకుని ప్రతిభావంతంగా ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెద్దలకు (సూపర్ చెఫ్), పిల్లలకు (లిటిల్ చెఫ్), రంగురంగుల రంగవల్లి పోటీలు, కళాపోటీలు, వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించారు. పిల్లలు ఇంటి నుండి పదార్థాలను తీసుకువచ్చి తల్లిదండ్రుల సహాయం లేకుండా అక్కడికక్కడే వారికి నచ్చిన ఆహారాన్ని తయారు చేసి తమ వంట నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూపర్ చెఫ్ పురుషులు మరియు మహిళల తమ వంటలతో ప్రతిభను ప్రదర్శించారు. రంగవల్లి పోటీల్లో వేసిన ముగ్గులు చూడదగ్గవిగా కనిపించాయి. మన ఇంటి వాతావరణాన్ని తలపింపజేసింది. సాయంత్రం 5:00 గంటలకు ‘‘భోగిపళ్ళు’’ కోసం పిల్లలందరినీ ఆహ్వానించడం ద్వారా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. తల్లిదండ్రులు మరియు తాతమామల భక్తి పాటలు పెద్ద కుటుంబ సమేతంగా కనిపించాయి.

‘వసుధైక కుటుంబం’’. పిల్లలందరికీ పెద్దలు ఆశీస్సులు అందజేశారు. అంతేకాకుండా, రంగురంగుల సంప్రదాయ చీరలు ధరించిన మహిళలందరితో ‘‘గొబ్బెమ్మలు’’ నృత్యం కన్నులపండవగా సాగింది. సంప్రదాయ తెలుగు మిఠాయిలు, తినుబండారాలు, పచ్చళ్లు, పొడి, పులిహోర, పనసపట్టు పలావ్, పెరుగు అన్నం, గుత్తి వంకాయ, బెండకాయ్ ఇగురు, ముద్ద పప్పు, దప్పలం, కిల్లి (పాన్) ఇతర వస్తువులను సంక్రాంతి విందులో అందించారు. స్వాగత్ ఇండియన్ వారు ఈ వంటకాలను అతిధులకోసం ఏర్పాటు చేశారు. 

భారత గణతంత్ర దినోత్సవం

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ కూడా భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై వచ్చినవారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి హాజరయ్యారు.  మోంటానో (మేయర్ మిల్పిటాస్), అలెక్స్ లీ (అసెంబ్లీ సభ్యుడు), మురళీ శ్రీనివాస్ (సన్నీవేల్ వైస్ మేయర్), షీలా మోహన్ (కుపర్టినో మేయర్), కౌన్సిల్ సభ్యులు రాజ్ సాల్వాన్, రాజ్ చాహల్, ఒట్టో లీ (సూపర్వైజర్)తోపాటు ఇతర ఎన్నికైన అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, ప్రత్యేక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు అలరించాయి.

టాలీవుడ్ నుండి తాజా సూపర్ హిట్ పాటలకు చిన్న పసిపిల్లలు, యువకులు చేసిన హై ఎనర్జీ మరియు ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్ లు ఆకట్టుకున్నాయి. శాన్ జోస్, కుపెర్టినో, ఫ్రీమాంట్, శాన్ రామోన్ మొదలైన వివిధ ప్రదేశాలలో బాటా నాయకులు చిన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా కష్టపడ్డారు.   ‘‘స్టార్ట్ కెమెరా యాక్షన్’’ (ఫ్యాషన్ షో), ఆన్-స్టేజ్ గేమ్ షోలు కూడా అలరించాయి. 

ఈ కార్యక్రమానికి వ్యాపార సంస్థల నుంచి భారీ మద్దతు లభించింది. ప్రోగ్రామ్ గ్రాండ్ స్పాన్సర్ ‘‘సంజయ్ టాక్స్ప్రో’’, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య ‘‘పవర్డ్ బై’’ స్పాన్సర్, గోల్డ్ స్పాన్సర్ ‘‘శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్’’. ఇతర స్పాన్సర్లలో పిఎన్జి జ్యువెలర్స్, టిఎఎస్క్యూఎ.ఎఐ., వివైజడ్ఎన్ (TASQA.AI & Vyzn) రియల్టర్లు ఉన్నారు.

ఈ సందర్భంగా బాటా అధ్యక్షుడు కొండల్ కొమరగిరి మాట్లాడుతూ, ఈ సంక్రాంతి వేడుకను విజయవంతం చేసినందులకు వలంటీర్లకు, బాటా టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. - శివ కదా, వరుణ్ ముక్క, హరి సన్నిధి.

స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవలి, సుమంత్ పుసులూరి.

సాంస్కృతిక కమిటీలో శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి ఉన్నారు.

‘‘లాజిస్టిక్స్ టీమ్’’లో సందీప్ కేదారిసెట్టి, సురేష్ శివపురం అండ్ రవి పోచిరాజు, యూత్ కమిటీ - సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సింధూర ఉన్నారు.

బాటా ‘‘సలహా మండలి’’ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా విజయవంతం చేసిన బాటా బృందానికి అభినందనలు తెలిపారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :