ASBL NSL Infratech
facebook whatsapp X

బెరైల్‌తో హ్యూస్టన్‌ అతలాకుతలం

బెరైల్‌తో హ్యూస్టన్‌ అతలాకుతలం

అమెరికాలో నాలుగో పెద్ద నగరమైన హ్యూస్టన్‌పై బెరైల్‌ తుపాను విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను వల్ల 20 లక్షల  ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇళ్ల పైకప్పుల నుంచి నీరు కారిపోతోంది. పగటి ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ను మించగా ఎయిర్‌ కండిషనర్లు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్‌, ల్యాండ్‌ లైన్లు, మొబైల్‌ ఫోన్లు ఏవీ పనిచేయలేదు. కార్లు నడపడానికి పెట్రోల్‌ అందుబాటులో లేకుండా పోయింది. నగర వీధులు తుపాను నీటితో జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు కూలిపడ్డాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అత్యవసర ప్రాతిపదికపై సహాయం అందించాలని టెక్సస్‌ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌ డాన్‌ ప్యాట్రిక్‌ అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తుఫానుతో దెబ్బతిన్న సగభాగానికి బైడెన్‌ అత్యవసర సహాయం ప్రకటించారు. తుపాను సృష్టించిన శిథిలాలను తొలగించడానికయ్యే ఖర్చులో 75 శాతాన్ని ఫెడరల్‌ ప్రభుత్వమే భరించనుంది. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :